2015ని నందమూరి సంవత్సరంగా చెప్పుకున్నారు. ఈ సంవత్సరం విడుదలైన నందమూరి మూడవ సినిమా లయన్ టాక్ ఆవరేజ్ అనే వస్తోంది. పటాస్ పేలినంతగా తరువాత వచ్చిన ఎన్టీఆర్, బాలయ్యల సినిమాలకు ఆ స్థాయి టాక్ రాలేదు. లెజండ్ తరువాత దాదాపు ఓ సంవత్సరం తరువాత వచ్చిన ‘లయన్’ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల 30 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. సమ్మర్ అడ్వాంటేజ్ ఉన్నా బీ,సీ సెంటర్స్ మినహా ఆశించిన కలెక్షన్స్ రాలేదని ట్రేడ్ వర్గాల మాట. బ్లాక్ బస్టర్ హిట్ ‘లెజెండ్’ తర్వాత వచ్చిన ‘లయన్’ ఫ్యాన్స్‌ను కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది. గుడ్ టాక్ వస్తే తప్ప, జనరల్ ఆడియన్స్ థియేటర్స్‌కు రాని పరిస్థితుల్లో వసూళ్లు తగ్గినట్టు తెలుస్తోంది. దీనికితోడు ఆదివారం ‘పటాస్’ టీవీ ప్రీమియర్ షో కారణంగా ‘లయన్’కు కాస్త కలెక్షన్లు తగ్గినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏరియాల వారీ నాలుగు రోజుల కలెక్షన్లు ఇలా వున్నాయి. నైజాం-2.92 కోట్లు, సీడెడ్- 2.34, గుంటూరు-1.24, ఉత్తరాంధ్ర-1.10, కృష్ణా- 83 లక్షలు, ఈస్ట్ గోదావరి-77, వెస్ట్- 75, నెల్లూరు-58 లక్షలు. టోటల్‌గా ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 10. 53 కోట్లు. కర్నాటక- 1.02 కోట్లు, ఓవర్సీస్- 50 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా -25 లక్షలు. వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల 30 లక్షలు.