ట్రై చేసి ఉంటే హీరోయిన్ గానే వచ్చేదేమో... మరెందుకో ఆలస్యంగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయినా నటనలో తనను తాను ప్రూవ్ చేసుకుంది... ఎంట్రీ ఇచ్చి కొద్ది కాలమే అయినా... అన్నిట్లోనూ వేళ్ళు దూర్చేసి మరీ పాపులర్ అయ్యింది... కొన్ని ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ... అడపాదడపా టీవీ షోల్లోనూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ... సినిమా అన్ని కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా పాల్గొంటూ... సినీ అసోసియేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతల్ని స్వీకరించి ఎప్పుడూ వార్తల్లో కనిపించే ఈ డేరింగ్ లేడీకి హిస్టారికల్ డేరింగ్ లేడీ ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్ర చేయాలనుందట. అది కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెరకెక్కిస్తే మరింత బాగుంటుందట. ఇక తన జీవితానికి ఈ కోరిక తీరితే చాలంటోంది. ఇటీవల ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకుంది. నిజంగానే ఈవిడ ఈ పాత్రకు బాగా సూటవుతుందండీ... మరి ఏ దర్శకుడైనా ఆమె కల నెరవేరిస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అనగనగా ఓ ధీరుడు తరువాత ‘గుండెల్లో గోదారి’, సినిమా చేసింది... ఇవి అంతగా సక్సెస్ కాకపోయినా బెస్ట్ ప్రతినాయకురాలిగా (అనగనగా ఓ ధీరుడు) నంది అవార్డు దక్కించుకుంది. ‘చందమామ కథలు’ సినిమా నేషనల్ అవార్డు అందుకుంది. అన్ని సినిమాల్లోనూ ఆమె పాత్ర పరంగా మంచి మార్కులే సంపాదించింది. ఇప్పుడు దొంగాట, బుడుగు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో దొంగాట సినిమాతో ఆమె సింగర్ గా కూడా మారిపోయి ప్రేక్షకులను మెప్పించింది కూడా.