ఆయనకు ఎవరినో ఒకరిని కామెంట్ చేయనిది రోజు గడవదనుకుంటా... తాజాగా రాంగోపాల్ వర్మ పవన్ ఫాన్స్ మీద పడ్డాడు... స్టుపిడ్స్ అన్నాడు... బుర్రలేదన్నాడు... ఈయన ఇలా స్పందించడానికి గల కారణం పవన్ అభిమాని ఒకరు 1500 కిలోమీటర్లు సైకిల్ పై రావడమేనట. అద్దంకి రవి అనే పవన్ అభిమాని, ఆయన్ను చూడ్డానికి ఖరగ్ పూర్ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. ఇదంతా వెర్రివాళ్ళు చేసే పనిలా రారంగోపాల్ కు అనిపించిందట... మరి ఇలా అందరినీ కామెంట్లు చేయడం, తనను తాను పబ్లిసిటీ చేసుకోవడంలో పొందుతున్న ఆనందం మాటేమిటి? తమకు నచ్చిన పని, కష్టమైనా సరే... ఇష్టంగా చేయడమే కదా... అభిమానమంటే... ఇందులో ఆనందమే గానీ, ఎవరినీ నొప్పించలేదు... కష్టపెట్టలేదు కదా ఆ అభిమాని...
అంత దూరం నుంచి సైకిల్ మీద రావడం... ఎనర్జీ వేస్ట్, టైమ్ వేస్ట్ అంటున్నాడు వర్మ. ఇలాంటి వారిని పవన్ ఎంకరేజ్ చేయకూడదంటున్నాడు.... ఇలాంటి వెర్రి పని ఏ అభిమానీ... చేయకూడదని సూచిస్తున్నాడు. మరి ఈ విషయంగా పవన్ కళ్యాణ్ ఏమంటాడో... పవన్ అభిమానులు ఏమంటారో వేచి చూడాల్సిందే... అయినా ఈయన పనేదో ఈయన ఇష్టంగా(నా ఇష్టం అంటూ) చేసుకుపోతున్నాడు కదా... ఆ పనిలో అంతో ఇంతో ఆనందాన్ని పొందుతున్నాడు... మరి అందరూ అంతే కదా... (వాళ్ళిష్టం)!