వర్మతో ముచ్చటగా మూడోసారి

November 14, 2014 | 04:51 PM | 9 Views
ప్రింట్ కామెంట్
       varma

మంచు విష్ణు ముచ్చటగా మూడోసారి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించనున్నాడు. వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ గొలుసు చిత్రంలో హీరోగా విష్ణు నటించనున్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రానికి రానాను హీరోగా అనుకున్నప్పటికీ బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో బీజీగా ఉండటం వల్ల తప్పుకున్నాడట. ఇక ఈ చిత్రాన్ని ఇప్పుడు విష్ణుతోనే తీయాలని వర్మ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడట. వర్మతో విష్ణు ఇది వరకు రౌడీ, అనుక్షణం చిత్రాలు చేశాడు. గతంలో వర్మ దర్శకత్వంలో వచ్చిన కంపెనీ , సత్య లాంటి మాఫియా నేపథ్యం ఉన్న కథతోనే గొలుసు చిత్రం ఉంటుందని సమాచారం. అయితే వర్మ-రానా కాంబినేషన్లో వచ్చిన డిపార్ట్ మెంట్ చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతోనే వర్మతో చిత్రం చేయాడానికి రానా భయపడుతున్నాడని, అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడని చిత్ర వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ

SELECT articles.alias as alias,categories.alias as cat_alias, sub_category.alias as sub_alias, articles.img as img, articles.title as title FROM articles join categories on articles.cate_id=categories.id join sub_category on articles.sub_cate_id=sub_category.id WHERE articles.id = (SELECT MAX(a.id) FROM articles as a WHERE a.id >= "" AND a.cate_id =3 AND a.sub_cate_id =8)