చైతూ బర్త్ డే గిఫ్ట్ గా ఫస్ట్ లుక్

November 22, 2014 | 05:33 PM | 36 Views
ప్రింట్ కామెంట్

నాగచైతన్య-స్వామిరారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మాయగాడు, దొరకడు, చివరికి హరిలో రంగ హరి పేరు ఖరారు చేసినట్లు గాసిప్స్ వచ్చాయి. ఈ విషయమై స్వయంగా దర్శకుడు సుధీర్ వర్మే కలగజేసుకుని మీడియా ముందుకొచ్చి ఇంకా ఏం నిర్ణయించలేదని చెప్పాల్సి వచ్చింది. నాలుగైదు పేర్లను పరిశీలనలో ఉన్నట్లు, ఈ విషయమై నాగార్జునతో సంప్రదించి టైటిల్ ను ఖరారుచేస్తామని దర్శకుడు వివరించాడు. ఇక ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చింది. ఆదివారం చైతూ పుట్టినరోజు సందర్భంగా ముందురోజు అంటే ఈ సాయంత్రం సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేస్తారట. ముందుగా టైటిల్ లేకుండా కేవలం టీజర్ ను మాత్రమే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ నాగ్ జోక్యంతో సస్పెన్స్ కు తెరదించుతున్నారని సమాచారం. చైతూ... అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్ డే విషెష్ తోపాటు గిఫ్ట్ గా టీజర్ ను అందుకో మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ