ఇంటర్ కుర్రాడే... రేప్ చేసి మర్డర్ చేశాడు!

March 03, 2016 | 04:12 PM | 2 Views
ప్రింట్ కామెంట్
minor-rape-and-murder-woman-in-old-city-niharonline

వయసులో కామోద్రేకాలను కంట్రోల్ చేసుకోలేక యువత దారుణాలను పాల్పడే ఘటనలు రోజుకోటి బయటపడటం మనకు తెలిసిందే. తాజాగా పాతబస్తీలో కిరాతంగా అత్యాచారానికి గురై హత్య కావించబడ్డ 36 ఏళ్ల మహిళ కేసును నాలుగు నెలల అనంతరం పోలీసులు చేధించారు. డబ్బీపురాలో జరిగిన ఈ దారుణానికి పాల్పడింది 19 ఏళ్ల ఇంటర్ బాలుడు కావటం ఇక్కడ విశేషం.

                     జీనత్ అనే వితంతువు పురానాహవేలిలో ఓ అపార్ట్ మెంట్ లో ఒంటిరిగా ఉంటుంది. ఓ షోరూమ్ లో సెల్స్ గర్ల్ గా పనిచేస్తున్న ఆమె ఫ్లాట్ కి తరచు బాయ్ ఫ్రెండ్ వస్తూ వెళ్తుంటాడు. అయితే అదే అపార్ట్ మెంట్ నిందితుడి(మైనర్) తాత నివసిస్తుంటాడు. తాతను చూసే వంకతో నిత్యం అక్కడికి వెళ్తున్న నిందితుడి కళ్లు ఒంటరిగా ఉంటున్న జీనత్ మీద పడింది. నవంబర్ 3, 2015న ఆమె ఫ్లాట్ కిటికీ ఊచలను తొలగించి చోరబడ్డాడు. అలికిడికి ఆమెకి మెలుకువ రాగా, గట్టిగా నోరు మూసేశాడు. దాంతో ఆమె సృహ కోల్పోయింది. అంతే తన కామ కోరికను తీర్చుకున్నాడు. ఆపై పక్కనే ఉన్న సెల్ ఫోన్ ఛార్జర్ తో ఉరిబిగించి ఆమెను హత్యచేశాడు. ఆపై బీరువాలో ఉన్న డబ్బు, సెల్ ఫోన్ తో ఉడాయించాడు.

ఉదయం ఫ్లాట్ కి వెళ్లిన స్నేహితుడు హత్య విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. అయితే ముందు ఆ స్నేహితుడిపైనే పోలీసులకు అనుమానం రాగా, ఆ తర్వాత నిందితుడి కదలికలపై ఇరుగుపోరుగువారు చెప్పిన కథనంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితుడు ఈ విషయాలన్నీ వెల్లడించాడు. అయితే తాను దొంగతనానికి మాత్రమే అక్కడికి వెళ్లానని నిందితుడు చెబుతుండటం గమనార్హం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ