ఘోరం: షార్ట్ ఫిల్మ్ కోసం బాలుడి హత్య

February 11, 2016 | 01:53 PM | 1 Views
ప్రింట్ కామెంట్
boy-killed-another-boy-in-karimnagar-shortfilm-niharonline

షార్ట్ ఫిల్మ్ తీయాలన్న పిచ్చితో ఓ బాలుడు మరో బాలుడిని కడతేర్చిన ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. కశ్మీర్‌గడ్డ ప్రాంతానికి చెందిన ఒర్సు కుమారస్వామి కాంట్రాక్టర్ కు ఇద్దరు కుమారులు. వారిలో లక్ష్మీప్రసాద్(7) గత నెల  17 కనిపించకుండా పోయాడు. ఫోన్ చేసి ఓ ఆగంతకుడు 5 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే జనవరి 22న మానేరు డ్యాం వద్ద బైపాస్‌రోడ్డులో కుళ్లిపోయిన స్థితిలో లక్ష్మీప్రసాద్ మృతదేహం లభ్యమైంది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

                      చివరకు పోలీసులు సైతం విస్తూ పోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ చిన్నారితో ఆడుకునే ఓ 17ఏళ్ల బాలుడే లక్ష్మీ ప్రసాద్ ను కిడ్నాప్ చేసి కడతేర్చాడంట. ఎలాగైనా షార్ట్ ఫిల్మ్ తీయాలని, ఖరీదైన బైకుల్లో తిరగాలన్నది ఆ బాలుడి కొరిక. దీనికి డబ్బులు అవసరం కావటంతో కిడ్నాప్ కు దిగాడు.

ఇంటి ఎదుట ఒంటరిగా ఆడుకుంటున్న లక్ష్మీప్రసాద్‌ను తన బైక్‌పై ఎక్కించుకుని వారి బంధువుల ఇంటికి వెళ్లాడు. లక్ష్మీప్రసాద్ ఆకలిగా ఉందనడంతో అన్నం తినిపించాడు. అక్కడనుంచి తాడు, ప్లాస్టర్ తీసుకుని లక్ష్మీప్రసాద్‌ను మానేరు డ్యాం బైపాస్‌రోడ్డులోని చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు. లక్ష్మీప్రసాద్ నోటికి ప్లాస్టర్ వేసేందుకు ప్రయత్నింగా అతడు బిగ్గరగా అరవడంతో గొంతు గట్టిగా నొక్కిపట్టాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. లక్ష్మీప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి వచ్చి కాయిన్‌బాక్స్ నుంచి మృతుడి తల్లికి ఫోన్ చేసి కిడ్నాప్ చేశామని చెప్పాడు. ఇంటికి వచ్చి మళ్లీ  లక్ష్మీప్రసాద్ కనిపించడం లేదని తల్లిని ఆరా తీయడంతో అందరూ కలిసి బాలుడికోసం వెదికారు. పోలీసులు రంగంలోకి దిగి నిత్యం ఆడుకునే ఈ బాలుడిని విచారించటంతో అసలు కథ బయటపడింది. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ కోర్టుకు హాజరుపర్చినట్లు తెలిసింది. ఇలా షార్ట్ ఫిల్మ్ తీయాలన్న కల ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ