సాయంత్రం కాగానే ఒకప్పుడు కుటుంబ సభ్యుల ఆటపాటలతో, ఫారిన్ టూరిస్ట్ ల రాకతో సందడిగా ఉండే హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్... నేడు అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. హైదరాబాద్ టూరిస్ట్ ఫేవరెట్ స్పాట్ లలో ఒకటిగా ఉన్న ఈ పార్క్ ను ఇప్పుడు పట్టించుకునే వారే కరువయ్యారు. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ పార్క్ ను తర్వాత అభి వృద్ధి సంగతి మరిచిపోయాయి గత ప్రభుత్వాలు. ఇక వీధిదీపాలు లేకపోవటంతో ఇక్కడ సాయంత్రం కాగానే అసాంఘిక కార్యకలాపాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. ఇక గతంలో సాయంత్రం కాగానే కుటుంబ సభ్యులతో ఆహ్లదంగా గడపడానికి వచ్చే వారు ఇఫ్పుడు ఈ పార్క్ లో జరిగే ఘోరాలు చూడలేక ఆవైపు రావటమే మానేశారు. మరోవైపు ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. వ్యభిచారమేకాదు... సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు సైతం తమ ప్రేమజంటలతో ఈ పార్క్ లో విరహ వేదనను తీర్చుకంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక పదికి పాతికకి కక్కుర్తి పడి వాచ్ మెన్లు కూడా వారెవరిని పట్టించుకోనే స్టేజీలో లేకుండా పోయారు. ఇదే తోవలో హైదరాబాద్ లోని కొన్ని పార్క్ లు తయారవుతున్నాయి. వాటి పరిస్థితిని గత ప్రభుత్వంలోని నేతలెవరికి చెప్పిన పట్టించుకోలేదని పలువురు చెబుతున్నారు. మీడియాలో సైతం వాటిపై కథనాలు వచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. లక్షలలో ఆదాయం వచ్చే ఇలాంటి పార్క్ లను రానురానూ జనాలు ఆదరించే పరిస్థితిలో లేకుండా పోతున్నారు. ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వం స్పందించి పరిస్థితి మెరుగుపరిచి పార్కులు పూర్వ వైభవంతో వర్థిల్లేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.