మిషన్ పూర్తయ్యే దాకా విశ్రాంతి ఇవ్వరట

December 22, 2014 | 11:10 AM | 20 Views
ప్రింట్ కామెంట్

తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఛాలెంజ్ గా తీసుకొని మరి ప్రకటించిన ప్రతిష్టాత్మక పథకం ‘మిషన్ కాకతీయ’. రాష్ట్రంలోని ఏ మహిళా మంచి నీళ్ల కోసం బిందె పట్టుకోని వీధుల్లోకి రాకుండా చూసుకుంటామని.... ఇంటింటికి మంచి నీరు సరఫరా చేస్తామని... అలా కాని పక్షంలో వచ్చే ఎన్నికలో ఓట్ల కోసం జనం ముందుకు రామని... స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం మిషన్ కాకతీయను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు ప్రజల్లో చెరువుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఓ పాటను రాయనున్నారట. ఈ మిషన్ ప్రకారం గ్రామగ్రామన ఉన్న చెరువుల ప్రక్షాళన చేపట్టి వాటి ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్నది టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ బృహత్ కార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారట. అంతేకాదు అవసరమనుకుంటే ఓ ఐదు నెలలపాటు సెలవు పెట్టకుండ పనిచేయాలని, కావాలంటే ఆ తర్వాత పదిహేను రోజులు సెలవు తీసుకోమ్మని చెబుతున్నారంట. తనతోపాటు అధికారులంతా లాప్ ట్యాప్ లు వెంట తెచ్చుకొని ఎక్కడికక్కడే పని పూర్తిచేయాలని లేకపోతే వారికి అక్కడికక్కడే నోటీసులు అందజేస్తామని హెచ్చరించారట. మరి దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక మరోవైపు ఈ మిషన్ కు తోడ్పాటు అందించాల్సిందిగా ఎన్నారైలను హరీష్ కోరారు. చెరువుల్ని దత్తత తీసుకొని పునరుద్ధరిస్తే వాటికి వారు కొరుకున్న పేరు పెడతామని వారికి ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఈ విషయమై జనవరిలో ఆయన ఎన్నారైలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తిస్థాయి విషయాలను వెల్లడిస్తారని చెప్పారు. మరి ఈ బంఫర్ ఆఫర్ కు తల్లొగ్గైన ఎన్నారైలు ముందుకు వస్తారా?. ఎదేమైనా మంత్రి హరీష్ తీరు చూస్తుంటే మిషన్ పూర్తయ్యేదాకా అధికారులను నిద్ర పోనిచ్చేలా లేడనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ