ఆ అబ్బాయిలో అమ్మాయి లక్షణాలు ఎందుకు?

March 19, 2016 | 03:57 PM | 6 Views
ప్రింట్ కామెంట్
uterus-found-in-karimnagar-kid-niharonline

అప్పుడప్పుడు సృష్టి ధర్మానికి విరుద్ధంగా కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఔరా అని ముక్కు మీద వేలు వేసుకుని ఓ విరుపు విరవటం తప్పించి మనం చేసేది ఏం ఉండదు. అలాంటి ఘటన ఇప్పుడు ఇక్కడ చోటుచేసుకుంది.  ఓ అబ్బాయి కడుపులో గర్భసంచి అభివృద్ధి చెందింది. అవును. చిన్నప్పటి నుంచి ఆడ పిల్లల లక్షణాలు కనిపిస్తున్నాయంటూ అతడి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతడిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. పురుషుడి కడుపులో కనిపించిన ఆ గర్భసంచిని ఆ తర్వాత ఆపరేషన్ చేసి తొలగించారు.

                       అరుదైన ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ముస్తాబాదులో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపెల్లి గ్రామానికి 13 కుర్రాడిలో చిన్నప్పటి నుంచి ఆడపిల్లల లక్షణాలు కనిపించాయి. దీంతో అతడిని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లిన అతడి తల్లిదండ్రులు ఇటీవల ముస్తాబాదులోని పీపుల్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అతడికి వైద్య పరీక్షలు జరిపిన వైద్యుడు బాలుడి కడుపులో గర్భసంచిని గుర్తించారు. హిమోప్రోడిజం అనే వ్యాధి వల్ల వేణులో ఆడ, మగ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయని శంకర్ తేల్చారు. ఆ తర్వాత వేణుకు ఆపరేషన్ చేసి అతడి కడుపులోని గర్భసంచిని తొలగించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ