కొణిదెల కళ్యాణ్ బాబు


మెగా ఫ్యామిలీ సినీ వారసుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన కంటూ నటనలో ఒక ట్రెండ్ సెట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అయినప్పటికీ, తొలి సక్సెస్ తొలిప్రేమే. డైరెక్షన్ ఎవరిదైనా తన ఓన్ ఐడింటిటీ ఇదే... అని నిరూపించుకుంటున్న ఏకైక నటుడు పవన్ కళ్యాణ్.
మరిన్ని వివరాలు




పేరు : కొణిదెల కళ్యాణ్ బాబు
ముద్దుపేర్లు : పవన్ కళ్యాణ్
పుట్టిన తేదీ : 1971-09-02
పుట్టిన ఊరు : బాపట్ల, ఆంధ్రప్రదేశ్
మాతృభాష : తెలుగు
చదువు : ఇంటర్, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్
వృత్తి : యాక్టర్, డైరెక్టర్,
హీరోగా తొలి సినిమా : అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి (1996)
గుర్తింపు తెచ్చిన సినిమా : తొలిప్రేమ (1998)
మొత్తం సినిమాలు : 19
అవార్డులు-రివార్డులు : 49 వ ఫిల్మ్ ఫేర్ అవార్డు-2001(ఖుషి-బెస్ట్ యాక్టర్), 56 వ ఫిల్మ్ ఫేర్ అవార్డు-2008 (జల్సా-బెస్ట్ యాక్టర్), 60వ ఫిల్మ్ ఫేర్ అవార్డు-2012 (గబ్బర్ సింగ్-బెస్ట్ యాక్టర్), ఇంకా ఈ సినిమాకు- సినీ మా అవార్డు, సైమా అవార్డు అందుకున్నారు. 61వ ఫిల్మ్ఫేర్ అవార్డు (దక్షిణాది) (అత్తారింటికి దారేది-2013), సంతోషం ఫిల్మ్ అవార్డు, మార్గదర్శి బిగ్ తెలుగు ఎంటర్ టైన్మెంట్ అవార్డు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు బెస్ట్ యాక్టర్ కాటగిరీకి అందుకున్నారు. (2014 లో స్టార్ ఇండియా చేసిన సర్వేలో ఇండియా టాప్ 5 హీరోల్లో ఒకరుగా ఉన్నారు. ఫోర్బ్స్ఇండియా అనే అమెరికన్ బిజినెస్ మాగజైన్లో ఇండియన్ సెలబ్రిటీల్లో మొదటి 100 మందిలో 25వ స్థానంలో ఉన్నట్టు రాశారు)
చిరునామా : ప్లాట్ నెం.5, రోడ్ నెం.9, జూబ్లీ హిల్స్, హైదరాబాద్