ఒకరకంగా చెప్పాలంటే కోలీవుడ్ కన్నా టాలీవుడ్ లో బ్రదర్స్ సూర్య-కార్తీలకు ఎంతో క్రేజ్ వుంది. అందుకే తెలుగు కన్నా తమిళంలోనే వీరిద్దరి సినిమాలు ఎక్కువ సెంటర్ లలో రిలీజ్ చేస్తుంటారు. ఆశ్చర్యకరంగా వీరి ఫ్లాప్ సినిమాల బిజినెస్ తెలుగులోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వీరిపై అభిమానం చూపించే ఇక్కడి ప్రేక్షకులకు చాలా సార్లు ప్రత్యేకంగా అభినందనలు కూడా చెప్పుకున్నారు ఈ అన్నదమ్ములు. సూర్య అయితే తెలుగు ప్రేక్షకుల ప్రేమకు తాను ఎప్పుడూ బానిసను అని చెప్పుకుంటాడు. కానీ, చాలాకాలంగా ఈ ఇద్దరికీ ఈ రెండు భాషల్లోను సరైన హిట్స్ పడలేదు. అయితే 2016 మాత్రం వీరిద్దరికి కలిసోచ్చింది.
కార్తీ ఏకంగా ఊపిరితో తెలుగులోనే భారీ విజయాన్ని అందుకున్నాడు, సూర్య 24 తో తాజాగా ప్రభంజనం సృష్టిస్తూ ఉన్నాడు. ఇక ఈ రెండు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టడం విశేషం. అయితే సూర్యతో వచ్చిన చిక్కల్లా తెలుగు మాట్లాడలేకపోవటం. కార్తీ కంటే సీనియారిటీలో, స్టార్ డమ్ లో సూర్యనే ఎక్కువ. అంతేకాదు బిజినెస్ కూడా అతని సినిమాకే ఎక్కువ జరుగుతుంది. కానీ, కార్తీ మాత్రం రెండో సినిమా నుంచి తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంటే... సూర్య మాత్రం తడబడుతూనే ఉన్నాడు. కమల్, రజనీ లాంటి స్టార్లు అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ రాణిస్తున్న టైంలో తెలుగు కూడా నేర్చేసుకుని మాట్లాడి ఇక్కడివారిని ఆకట్టుకునే వారన్నది తెలిసిందే. వారిద్దరి తర్వాత అంత పేరు తెచ్చుకున్న సూర్య మాత్రం ఆడియో వేడుకల్లో అభిమానులు అరిచి అడిగినప్పటికీ డైలాగులు చెప్పలేక దాటవేయడం మైనస్ అనే చెప్పుకోవాలి.