కత్తిలాంటోడికి సరైనోడు దొరికాడు

May 14, 2016 | 11:08 AM | 5 Views
ప్రింట్ కామెంట్
devisriprasad-chiru-selfie-niharonline

ఏడాది నుంచి ఊరించి ఊరించి వస్తున్న చిరు 150చిత్రంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ముహుర్త షాట్ మొదలవ్వటంతో మెగా అభిమానులు తెగ ఖుషీ అయిపోయారు. వినాయక్ దర్శకత్వంలో కత్తికి కొన్ని మార్పులు చేసి మరీ ప్రేక్షకుల ముందుకు తేనున్నారంట. ఇక హీరోయిన్ నయనతార, అనుష్క అన్న కన్ఫ్యూజన్ కాస్త ఉంది. ఇదిలా ఉంటే జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్న కత్తిలాంటోడు మూవీ కోసం మొదటి రోజు చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని మ్యూజిక్‌డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

                             గతంలో శంకర్ దాదా, శంకర్ దాదా జిందాబాద్ లకు దేవీ మ్యూజిక్. అది గాక గ్రాండ్ రీఎంట్రీకి అదిరిపోయే మ్యూజిక్ లు ఇచ్చే సత్తా కేవలం దేవీ కి మాత్రమే ఉందని చిరు నమ్మి ఈ బాధ్యతలు అప్పజేప్పాడంట. ముందుగా థమన్ ను అనుకున్నప్పటికీ బ్రూస్ లీ అవుట్ పుట్ చూశాక చిరు మనసు మార్చుకున్నాడంట. అంతేకాదు మెగా హీరోలకు ప్రత్యేక బాణీలు అందించడంలో దేవీ దిట్ట. సో... చిరు, దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందన్న మాట. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన సెల్ఫీని అభిమానులతో దేవీ షేర్ చేసుకుని తెగ సంబర పడిపోతున్నాడు. అంతే కాదు విత్ బాస్... వెల్ కమ్ బ్యాక్ బాస్ సార్ అంటూ సందేశం కూడా పోస్ట్ చేశాడు. అటు బాలయ్య 100 ఇటు చిరు 150 రెండు ప్రిస్టీజియస్ ప్రాజెక్టులకు ఒకేసారి పని చేస్తున్నాడు రాకింగ్ స్టార్.  చిరుకి సరైనోడే దొరికాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ