లిప్ లాక్ కోసం హీరోయిన్ అతి

May 14, 2016 | 10:27 AM | 7 Views
ప్రింట్ కామెంట్
heroine-ask-hero-medical-reports-niharonline

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో సినిమాల్లో లిప్ లాక్ లు సర్వసాధారణం అయిపోయాయి. చూసే జనాలు కూడా పిచ్చలైట్ తీసుకుని వాటిని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకు ముందు బాలీవుడ్ కే పరిమితమైన ఈ ముద్దు సీన్లు ఇప్పుడు సౌత్ సినిమాల్లో కంపల్సరీగా మారిపోయాయి. హీరోహీరోయిన్లు కూడా మొహమాటాలు పక్కన పెట్టి పెదాలను జుర్రేసుకుంటున్నారు. అయితే ఓ హీరోయిన్ లిప్ లాక్ కోసం పెట్టిన కండిషన్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

                              కోలీవుడ్ లో ఓ అగ్రహీరోయిన్ ఒక చిత్రంలో హీరో తో పెదాలను కలిపేందుకు నో చెప్పిందట. హీరోకు హెపటైటిస్ ఉందని తన అనుమానం అని, అది తనకు అంటే ఛాన్స్ ఉందని, కాబట్టి సారీ అనేసిందట. అయితే సీన్ కంపల్సరీ అని దర్శకుడు అనటంతో ఓ కండిషన్ పెట్టిందట. వైద్యపరీక్షలు జరిపి ఏం లేదని తేలిస్తే తాను ముద్దు సీన్ కు రెడీ అని చెప్పిందట. హెపటైటిస్-బి రక్తం ద్వారాగానీ, లాలాజలం ద్వారా గానీ వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కండిషన్ అంటూ హీరో సమక్షంలో దర్శకుడితో చెప్పిందట.. ఇది విని హర్టయిన హీరోగారు టోటల్ గా సీన్ సినిమాలోంచి లేపయాలని దర్శకుడితో చెప్పాడంట.

గతంలో హీరోయిన్లు ముద్దు సీన్లను చాలా కారణాలతో నిరాకరించారు. కానీ, ఇలా వైద్యపరీక్షలు చేయించాలన్న తిరకాసు పెట్టిన హీరోయిన్ బహుశా ఈమెనేమో. ఇంతకీ ముద్దు కోసం ఇంత రాద్ధాంతం చేసింది ఎవరయి ఉంటారు?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ