అర్థరాత్రి షాపింగ్ మాల్ పై పడ్డ శంకర్

May 19, 2016 | 03:14 PM | 17 Views
ప్రింట్ కామెంట్
robo-2-shooting-vijaya-mall-niharonline

శంకర్ అంటేనే  భారీ తారాగణం, పెద్ద పెద్ద సెట్స్, గ్రాఫిక్స్, వెరసి భారీ ఖర్ఛు అవుతుందనేది మనకు తెలుసు. ఇక  చిత్రీకరణ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడడు. రోబో, ఐ చిత్రాల కోసం వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టిన ఆయన ఇప్పుడు మరో రికార్డు పై కన్నేశారు. దేశంలోనే తొలిసారి అత్యధిక బడ్జెట్ తో రోబో-2 ను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగుకు కోసం ఓ భారీ షాపింగ్ మాల్ ను బుక్ చేసేసాడంట. వేలాది మందితో నిత్యం రద్దీగా ఉండే  చెన్నయ్ లోని ఫోరం విజయ్ మాల్ మొత్తాన్ని షూటింగ్ పర్పస్ కోసం బుక్ చేశాడట. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్న ఈ సన్నివేశాల కోసం నిర్మాతల నుంచి భారీ గానే ఖర్చు పెట్టిస్తున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని ఆ మాల్ యాజమాన్యానికి చెల్లించినట్టు చెబుతున్నారు. పలు ఫ్లోర్లతో వుండే ఈ భారీ షాపింగ్ మాల్ లో నైట్ సీక్రెట్ షూటింగ్ జరుగుతుండగా, కొందరు యువకులు తీసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ