ఓవైపు రెమ్యునరేషన్ పేరిట కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్న హీరోలు అందులో భాగస్వాములుగా కూడా మారిపోతున్నారు. రాంచరణ్, మహేష్ లు ఈ రుచికి ఈమధ్య బాగా మరిగారు. నిర్మాతగా మారి 'శ్రీమంతుడు' సినిమాతో భారీ లాభాలు ఆర్జించాడు మహేష్. అదే బాటలో 'బ్రహ్మోత్సవం' సినిమా నిర్మాణంలోను మహేశ్ భాగస్వామ్యం వుందనే వార్తలు వినిపించాయి. బ్యానర్ లో కూడా ఎంబీ లోగో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది కూడా.
అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో కూడినది కావడంతో, ఆ తరువాత భాగస్వామ్యం వదులుకుని భారీ రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడని చెబుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా అవుట్ రేట్ పీవీపీ వారిదేనంట. బడ్జెట్ అనుకున్న స్థాయిని దాటిపోవడంతోపాటు, లాభాలను బేరీజు వేసుకుని మహేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు. ఇక మహేష్-మురగదాస్ సినిమా కూడా దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందనుంది. దాంట్లోనూ భాగస్వామిగా ఉండకుండా, భారీ మొత్తంగా పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. లెక్కల మీద సినిమాను నడిపిస్తున్నాడన్న మాట.