మహేష్ ని చూసి తెగ మురిసిపోతుంది

May 14, 2016 | 11:59 AM | 9 Views
ప్రింట్ కామెంట్
samantha-about-mahesh-brahmotsavam-niharonline

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో సినిమా లో ఛాన్స్ కావాలి... ఇది ఇప్పుడున్న, వస్తున్న హీరోయిన్లకు ఉండే డ్రీమ్. ప్రిన్స్ లాంటి అందగాడి పక్కన ఒక్కసారి కనిపించిన చాలు తమ జన్మ ధన్యం అన్నంతలా  తాప్రతయ పడిపోతుంటారు. రీసెంట్ గా పెళ్లేప్పుడమ్మా అంటే మహేష్ తో సినిమా తర్వాతే అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పటం బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత వెయిటింగ్ లో ఉందో. అలాంటిది ఏకంగా మహేష్ తో మూడు సార్లు జోడీ కట్టింది సమంత. దూకుడు, సీతమ్మ వాకిట్లో లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత బ్రహ్మోత్సవంలో నటిస్తోంది. ఇదే విషయమై ఆరాతీస్తే చాలా అదృష్టవంతురాలినని హ్యాపీగా ఫీలవుతోంది.

                           మహేష్ తో ఇప్పటిదాకా  చేసిన ప్రయాణం చాలా బాగుంది. రెండు సార్లు బిగ్ హిట్ లు అందించాం. ఇది కూడా తప్పకుండా హిట్ అవుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో తనకు, మహేష్ కు వచ్చే సన్నివేశాలు చాలా రీఫ్రెషింగ్ గా ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇంకా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా మీ మధ్య గొడవలేం కాలేదా అని అడిగితే... ప్రతీ క్యారెక్టర్ కి ప్రాధాన్యం ఉన్నప్పుడు మీరన్నట్లు గొడవలేందుకు వస్తాయి అంటూ మాంచి రిప్లై ఇచ్చింది.  నిజానికి చిత్రంలో తాను నటించిన పాటలకన్నా బాలాత్రిపురమణి సాంగ్ తనకు చాలా బాగా నచ్చిందని, తను పదే పదే ఆ పాటే వింటున్నానని, ఈ పాటలో మహేష్ కుర్రాడిలా కనిపిస్తున్నాడని మురిసిపోయింది. ఇలా తన పాట కాకుండా వేరే హీరోయిన్ నటించిన పాట గురించి చెప్పాలంటే కాస్త పెద్ద మనసు ఉండాలి లేండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ