తండ్రి గురించి జగపతి షాకింగ్ కామెంట్లు

May 13, 2016 | 03:19 PM | 8 Views
ప్రింట్ కామెంట్
jagapathi-babu-comments-on-rajendraprasad-niharonline

ఓపెన్ గా మాట్లాడటం మంచిదే. కానీ ఒక్కోసారి అదే వివాదాలను సృష్టించడం కూడా జరుగుతూ ఉంటుంది. వెండితెర వెనుక జరిగే బాగోతాల గురించి తెలీంది కాదు. అవకాశాల కోసం హీరోయిన్లను వాడుకుంటారంటూ కొద్ది మంది గుసగుస లాడటం మనం చూస్తుంటాం. కానీ, ఓపెన్ పేరిట సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలే వారికి చిక్కులు తెచ్చిపెడతున్నాయి. హీరోగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న జగపతిబాబు ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఆ ఫ్లో లో తన తండ్రి, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ గురించి ఆయన చేసిన షాకింగ్ కామెంట్లు వివాదాన్ని సృష్టిస్తున్నాయి.

                     జగపతిబాబు ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, తన జీవితంలోని మరో కోణాన్ని వెల్లడిస్తూ, హీరోయిన్ల గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. ఒకప్పుడు టాప్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్న తన తండ్రి జీవితాన్ని చూసి తాను కూడా ఓ 'ప్లే బాయ్'గా జీవితాన్ని ఆనందించానని ఆయన అనడం కొంత కలకలం రేపింది. జగపతిబాబు ఓపెన్ మైండెడ్ గా ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, చనిపోయిన తన తండ్రి గురించి ఇలాంటి ప్రస్తావన చేయాల్సిన అవసరం ఏంటని పలువురు సినీ పెద్దలు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ