కన్నడ సెక్సీకి రెండేళ్ల జైలు శిక్ష

May 14, 2016 | 12:40 PM | 12 Views
ప్రింట్ కామెంట్
maithriya-gowda-two-years-imprisonment-niharonline

కేంద్ర మంత్రి సదానంద గౌడ కొడుకు కార్తీక్ తనను రేప్ చేశాడంటూ అప్పట్లో రచ్చ చేసిన హీరోయిన్ మైత్రేయ గౌడ గుర్తుందా? తనను పెళ్లి చేసుకుని, శారీరకంగా వాడుకున్నాడని, ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ రెండేళ్ల క్రితం మీడియా ముందు గగ్గొలు చేసింది. అయితే పోలీసులు కలగజేసుకుని సాక్ష్యాలు లేవని తేలటంతో గప్ చుప్ గా సైడ్ అయిపోయింది. కొన్ని బీ గ్రేడ్ సినిమాలతోపాటు ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్ లాంటి అగ్ర హీరోలతో సైతం. కాంట్రవర్సరీతో ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.

                                           ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నందుకు అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను దుర్భాషలాడటమే కాకుండా, చెయ్యి చేసుకున్న కన్నడ నటి మైత్రేయ గౌడకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే, 2011లో మైత్రేయ తన సోదరి సుప్రియ, స్నేహితురాలు రేఖ, రూపలతో కలిసి కారులో వెళ్తూ, డ్రైవింగ్ చేస్తోంది. ఆమె సెల్ ఫోన్ మాట్లాడటాన్ని చూసిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ ఆపి కారును ఫోటో తీసేందుకు యత్నించాడు. అప్పుడు వీరు నలుగురూ అతనిపై దాడి చేసి కొట్టారు. కేసును విచారించిన న్యాయస్థానం మైత్రేయకు రెండేళ్లు, మిగిలిన వారికి ఏడాది చొప్పున జైలు శిక్ష విధించింది. పై కోర్టులో అపీలు చేసుకునే అవకాశాన్ని ఇస్తూ బెయిల్ ఇచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ