నిత్యమీనన్ లైట్ తీస్కోంటోంది

May 11, 2016 | 05:42 PM | 4 Views
ప్రింట్ కామెంట్
nithya-menon-in-24-niharonline

తెలుగు సినిమాల్లో ఏ నిరాటంకం లేకుండా కెరీర్ ముందుకెళ్లాలంటే హీరోయిన్ హాట్ షో చేయాల్సిన అవసరం లేదు. అందుకు నిదర్శనం నిత్యామీనన్. అలా మొదలైంది లో అల్లరి పాత్ర చేసినా, సన్నాఫ్ సత్యమూర్తిలో పొగరు పాత్ర పండించినా, మళ్లీ మళ్లీ లో సీరియస్ ప్రేమికురాలి రోల్ లో అలరించినా నిత్యా మీనన్ ఒకటే ఫార్ములా ఫాలో అయిపోతుంది. సినిమా ఏదైనా, తన పాత్ర నిడివి ఎంత ఉన్నా సరే, పాత్రలో లీనమైపోయి జీవించేయటం.  తనకిచ్చిన పాత్రకి ప్రాణం పోయటం. ఒక్కడినే సినిమా తప్పించి ఆమె నటించిన అన్ని చిత్రాలు వేటికవే ప్రత్యేక జోనర్ లో ఉండటంతోపాటు, ఆమె పాత్ర కూడా అంతగా హైలెట్ అయ్యాయి కూడా. తాజాగా '24' ను గమనించినా ఇదే గమనించవచ్చు. సూర్య లాంటి స్టార్ హీరో పక్కన నటించినా ఒక్క పాట కూడా ఆమెకు లేదు. ఎక్కువ సీన్లు కూడా లేవు. అయినా సరే.. ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వని నిత్యా కేవలం ఏ హీరోతో నటించినా కెమిస్ట్రీని పండించగలను అని నిరూపించింది. సినిమా మొత్తం ఉన్న సమంత కన్నా కాసేపు నిత్య పాత్ర హైలెట్ అవ్వటం ఆమె నటనకు నిదదర్శనం. సూర్య లాంటి పెద్ద హీరో అయినా, స్టార్ సందీప్ కిషన్ లాంటి సాదాసీదా కథానాయకుడి అయినా ఆమెకు ఒక్కటే. అందుకే ఇప్పుడున్న హీరోయిన్లలో నిత్య సమ్ థింగ్ స్పెషల్. తన పాత్రల గురించి ఎవరైనా కామెంట్లు చేసినా అస్సలు పట్టించుకోకుండా, స్కిన్ షో పక్కనబెట్టి ఇలా తన నటనతో వారికి సమాధానం చెప్పుకుంటూ వస్తోంది ఈ పొట్టి పిల్ల.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ