మహేష్ బాబు కంట కన్నీరు

May 18, 2016 | 12:17 PM | 21 Views
ప్రింట్ కామెంట్
Mahesh-Babu-cry-while-dubbing-for-brahmotsavam-niharonline

ఫ్యామిలీ సంబంధాలను తెరపై అందంగా చూపించటంలో దిట్ట శ్రీకాంత్ అడ్డాల. సీతమ్మ వాకిట్లో సినిమాతో మల్టీస్టారర్ కు ఆద్యం పోయటంతో పాటు, అందులో సూపర్ స్టార్ మహేష్ ను చూపించిన విధానం ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. ఇక సరిగ్గా ఇప్పుడు అలాంటి పంథాలోనే బ్రహ్మోత్సవం మరో రెండు రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు. కుటుంబ మూలాలను వెతుకుంటూ వెళ్లే యువకుడిగా మహేష్ ఇందులో అలరించబోతున్నాడు. ఇక చిత్ర విడుదల దగ్గర పడ్డ కొద్దీ టీవీ చానెళ్లలో ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు మహేష్ , హీరోయిన్లు సమంత, కాజల్ లు. ప్రతీ ఇంటర్వ్యూలో ఒక్కో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతూ సినిమా పై హైప్ పెంచేస్తున్నారు.

                                ఓ టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ... సినిమాకి ముందుగా కాజల్ పేరును అస్సలు అనుకోలేదని, ఇద్దరు ముగ్గురు వేరే హీరోయిన్లను సంప్రదించి, ఆపై కాజల్ ను ఎంపిక చేసినట్లు చెప్పాడు. ఇక తెరపై సినిమా చూస్తున్నంత సేపు నటులు కనిపించరని, కేవలం ఆయా పాత్రలు మాత్రమే కనువిందు చేస్తాయని అంటున్నాడు. ముఖ్యంగా కొన్ని సీన్లకు డబ్బింగ్ చెప్పేటప్పుడు తనకు తెలియకుండానే కళ్ల వెంట నీరు కారిందని, అవి గుండెల్లోంచి వచ్చినవని ఎమోషనల్ గా ఫీలవుతూ చెప్పాడు . క్లైమాక్స్ సీన్ చేసిన తరువాత, ఇంటికి వెళ్లి ఓ మంచి చిత్రం ఒప్పుకున్నందుకు ఎంతో సంతృప్తి చెంది ఆనందంగా నిద్రపోయాడంట. ఇక షూటింగ్ అంతా ఓ మ్యాజిక్ మాదిరిగా  పూర్తయిందని,  ఫలితం కోసం వేచి చూడటంలో తనకు ఎలాంటి ఆతృతా లేదని, ఖచ్ఛితంగా ఇది ప్రేక్షకులను అలరించి తీరుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు ప్రిన్స్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ