కేటీఆర్ కి రిప్లై ఇచ్చిన సూర్య

May 11, 2016 | 03:36 PM | 6 Views
ప్రింట్ కామెంట్
ktr-suriya-24-niharonline

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపాడు. ‘థ్యాంక్యూ మచ్ సార్ ! సో గ్లాడ్ ఆల్ లైక్డ్ 24’ అంటూ సూర్య ట్వీట్ చేశాడు. సూర్య నటించిన ‘24’ చిత్రం అద్భుతంగా ఉందని, ఆయన నటనా కౌశలం అమోఘం మంటూ గత రాత్రి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ కు స్పందించిన సూర్య తన కృతఙ్ఞతలు తెలిపారు. కాగా, తన కూతురు, కొడుకు ‘24’ సినిమా చూడాలని అనడంతో వెళ్లి చూశామని, స్క్రీన్ ప్లే, సూర్య నటన అద్భుతంగా ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తయారైన చిత్రం ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాగా, పలువురు విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. తమిళ్ తో పోటీపడి మరీ తెలుగులో కలెక్షన్లు కొల్లగొడుతున్న 24 ఓవర్సీస్ లోనూ వసూళ్లను రాబడుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ