అక్కినేని నాగార్జునః


అక్కినేని వారి రెండో తరం నట వారసుడు నాగార్జున. విక్రమ్ సినిమాతో (హిందీ హీరో) ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత కెప్టెన్ నాగార్జున వంటి మరో నాలుగైదు సినిమాల్లో నటించినప్పటికీ... బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘శివ’ అనే చెప్పాల. మంచి రొమాంటిక్ హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడిగా గీతాంజలి, మన్మధుడు వంటి సినిమాల్లో మెప్పించి... ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీ సాయిబాబా’ వంటి భక్తిరస ప్రధాన చిత్రాల్లోనూ నటించి గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ 90 చిత్రాల్లో నటించి, రెండు జాతీయ అవార్డులు, 9 రాష్ట్ర నందులు, 2 దక్షిణ భారత ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు. అక్కినేని వారి మూడో తరం వారసులను (నాగచైతన్య, అఖిల్) అందించడమే కాదు, అక్కినేని నాగేశ్వర్రావుతో ‘మనం’ అనే సినిమా నిర్మించి తెలుగు పరిశ్రమకు మూడు తరాలు నటించిన ఓ ఆణిముత్యాన్ని అందించిన ఘనత దక్కించుకున్నారు. 

మరిన్ని వివరాలు




పేరు : అక్కినేని నాగార్జునః
ముద్దుపేర్లు : అక్కినేని నాగార్జున
పుట్టిన తేదీ : 1959-08-29
ఎత్తు : 6‘0
పుట్టిన ఊరు : చెన్నై, తమిళనాడు, ఇండియా
మాతృభాష : తెలుగు
చదువు : హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ, మద్రాస్ గుండి ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్
వృత్తి : నటుడు, నిర్మాత
అభిరుచులు : పురాతన వస్తువుల సేకరణ, ఫొటోగ్రఫీ, మొక్కలు పెంచడం
నచ్చిన ఫుడ్ : స్పానిష్ వంటలు
దుస్తులు : క్లాసిక్ వెస్టర్న్
నచ్చిన సంగీతం : హిందుస్థానీ, సాఫ్ట్ రాక్
నచ్చిన సినిమా : ఎపిక్స్
తండ్రి : అక్కినేని నాగేశ్వరరావు
తల్లి : అక్కినేని అన్నపూర్ణ
భార్య/భర్త : అక్కినేని అమల సోదరులు : అక్కినేని వెంకట్ సోదరీమణులు : సత్యవతి బావలు : యార్లగడ్డ సురేంద్ర, చలసాని రమేష్ మేనల్లుడు : సుమంత్ (సినీ యాక్టర్) మేనకోడలు : సుప్రియ (ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ఫేమ్), కుమారులు : అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్
చిరునామా : ప్లాట్ నెం.959-ఎ, రోడ్ నెం.48, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 033