అల్లు అర్జున్


అల్లు అర్జున్ కూడా నట వారసుడే... హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనుమడు. నిర్మాత అల్లు అరవింద్ రెండవ  కుమారుడు. మెగాస్టార్ చిరంజీవికి అల్లుడు. దర్శకేంద్రుడు రాఘవేందర్రావు దర్శకత్వం వహించిన ‘గంగోత్రి’ సినిమాలో తొలి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాలో స్టెయిల్ లేకపోయినా... సక్సెస్ మాత్రం సాధించాడు. తన రెండవ సినిమా ఆర్య తో రెండో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్టెయిలిష్ స్టార్ గా, మంచి ఎంటర్టైన్ అందించే నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తను చేసిన ఎక్కువ సినిమాలు సక్సెస్ అనే చెప్పాలి. 

మరిన్ని వివరాలు




పేరు : అల్లు అర్జున్
ముద్దుపేర్లు : బన్నీ, స్టైలిష్ స్టార్
పుట్టిన తేదీ : 1983-04-08
ఎత్తు : 5‘9
పుట్టిన ఊరు : చెన్నై, తమిళనాడు, ఇండియా
మాతృభాష : తెలుగు
చదువు : స్కూలు: సెంట్ ప్యాట్రిక్ స్కూల్, చెన్నై బిబిఎ డిగ్రీ, ఎం.ఎస్.ఆర్. కాలేజి, హైదరాబాద్. ` సినిమా
వృత్తి : యాక్టర్
అభిరుచులు : మ్యూజిక్, డాన్స్, సినిమాలు చూడ్డం, బుక్స్ చదవడం, షాపింగ్
తీరాల్సిన కోరికలు : గ్యాంగ్ లీడర్, ఇంద్ర లాంటి సినిమా చేయాలని,
నచ్చిన ఫుడ్ : థాయ్, మెక్సికన్
నచ్చిన పానీయం : వాటర్ మిలన్ జ్యూస్
దుస్తులు : డిజైనర్
నచ్చిన రంగు : బ్లాక్, వైట్, సిల్వర్.
నచ్చిన పుస్తకం : ఓహ్ లైఫ్, రిలాక్స్ ప్లీజ్’, ‘హూ మూవ్డ్ ఛీజ్’- డా.స్పెన్సర్ జాన్సన్
నచ్చిన సంగీతం : సుఫీ సంగీతం, రెగ్గె. పాట: నిజంగా... నేనేనా... ఇలా నీ జతలో ఉన్నా...
నచ్చిన వాహనం : స్కార్పియో, సఫారీ, సియోరా
నచ్చిన హీరో : చిరంజీవి
హీరోయిన్ : రాణీ ముఖర్జీ
నచ్చిన సినిమా : గ్యాంగ్ లీడర్
నచ్చిన సంగీత దర్శకుడు : హరిహరన్, కె.కె., శంకర్ మహదేవన్
హీరోగా తొలి సినిమా : ’డాడీ‘ సినిమాలో డాన్స్ చేస్తూ కనిపిస్తాడు
గుర్తింపు తెచ్చిన సినిమా : ఆర్య (2004)
మొత్తం సినిమాలు : 15
తాత : పద్మశ్రీ స్వర్గీయ అల్లు రామ లింగయ్య
తండ్రి : అల్లు అరవింద్ (నిర్మాత)
తల్లి : నిర్మల
భార్య/భర్త : స్నేహారెడ్డి
 సోదరుడు / సోదరి : అల్లు వెంకటేష్, అల్లు సిరీష్.
 పిల్లలు : అల్లు అయాన్
చిరునామా :