కన్నెగంటి బ్రహ్మానందం


లెక్చరర్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ నటన మీద ఉన్న మక్కువతోనూ, గురువు,దర్శకుడు హస్య బ్రహ్మ జంధ్యాల గారి ప్రొత్సాహంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బ్రహ్మనందం అలియాస్ బ్రహ్మీ. తెరపై ఆయన అసలు కనిపించనక్కర్లేదు. వినిపిస్తే చాలు. నవ్వు దానంతట అదే తన్నుకొస్తుంది. అసలు గుండ్రని ఆయన ‘బట్టతల’ కనిపిస్తే చాలు పగలబడి నవ్వని వాళ్లు ఉండరంటే అతిశయోక్తికాదు. వెయ్యవ చిత్రానికి చేరువకాబోతున్న బ్రహ్మీ గిన్నిస్ రికార్డుతోపాటు గౌరవ డాక్టరేట్, కేంద్రం ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
మరిన్ని వివరాలు




పేరు : కన్నెగంటి బ్రహ్మానందం
ముద్దుపేర్లు : బ్రహ్మానందం
పుట్టిన తేదీ : 1956-02-01
పుట్టిన ఊరు : ముప్పాళ్ళ, చాగంటివారి పాలెం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా
మాతృభాష : తెలుగు
చదువు : ఇంటర్, డిగ్రీ (భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజ్) ఎం.ఎ (గుంటూరు పీజీ కాలేజ్)
వృత్తి : నటుడు (అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేశాడు)
హీరోగా తొలి సినిమా : తాతావతారం (1985)
గుర్తింపు తెచ్చిన సినిమా : ఆహా నా పెళ్ళంట (1987) (విడుదలైన మొదటి సినిమా)
మొత్తం సినిమాలు : 900
అవార్డులు-రివార్డులు : అత్యధిక సినిమాల్లో నటించిన హాస్యనటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు. తొలి నంది పురస్కారం (ఆహానా పెళ్ళంట) మరో నాలుగు నందులు, ఐదు కళాసాగర్, తొమ్మిది వంశీ బర్కిలీ, సినీ గోయర్స్ పది, 8 భరతముని, 1 ఫిలిం ఫేర్, 1 రాజీవ్ గాంధీ సద్భావనా, ఆటా, సింగపూర్, లండన్ డాకర్స్, అరబ్ మిరేట్స్, ఆస్రేలియా తెలుగు అసోసియేషన్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీ వారి సన్మానాలు.
చిరునామా : ఎ-93, జర్నలిస్టు కాలనీ, జూబిలీహిల్స్, హైదరాబాద్.