ప్రభుదేవ


టాలీవుడ్, కోలీవుడ్ మైకేల్ జాక్సన్ గా పేరొందిన ప్రభుదేవ కొరియో గ్రాఫర్ సుందరం మాస్టార్ కుమారుడు. తండ్రి వారసత్వం అబ్బినా, నటుడిగా, దర్శకుడిగా కూడా నిరూపించుకున్నాడు. తెలుగులో డైరెక్ట్ గా నటించినవి కొన్ని చిత్రాలే అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా, చుక్ బుక్ చుక్ బుక్ రైలే... పాటతో తెలుగు ప్రేక్షకులూ తమ వాడిని చేసుకున్నారు. ఇక ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా...’ సినిమాతో దర్శకత్వంలోనూ తన టాలెంట్ నిరూపించుకుని, కొన్ని బాలివుడ్ చిత్రాలకూ దర్శకత్వ బాధ్యతలను అందిపుచ్చుకుని, అక్కడే సెటిలైపోయాడు.

మరిన్ని వివరాలు




పేరు : ప్రభుదేవ
ముద్దుపేర్లు : ఇండియన్ మైకేల్ జాక్సన్
పుట్టిన తేదీ : 1973-04-03
పుట్టిన ఊరు : మైసూరు, కర్నాటక, ఇండియా
మాతృభాష : తమిళ్
వృత్తి : నటుడు, దర్శకుడు, డాన్స్ డైరెక్టర్ (ఐదు భాషలకు), సింగపూర్ లోని ప్రభుదేవ డాన్స్ అకాడెమీ ఛైర్మన్
హీరోగా తొలి సినిమా : నువ్వొస్తానంటే నేనొద్దంటానా (దర్శకత్వం)1988(అగ్ని నాచతిరమ్(తమిళ్)-1993 వరకుఅప్పుడప్పుడు ఒక పాటలో
గుర్తింపు తెచ్చిన సినిమా : ‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’(2005), ‘లవ్ బర్డ్స్’(తమిళ్ -1993) (తెలుగులోకి డబ్ అయ్యింది)
మొత్తం సినిమాలు : కొరియోగ్రాఫర్ గా 100కు పైగా దర్శకత్వం 12 నటుడిగా 67
అవార్డులు-రివార్డులు :

కొరియోగ్రాఫర్ గా 2 జాతీయ అవార్డులు (1997-2004), బెస్ట్ డాన్స్ డైరెక్టర్ గా నంది అవార్డు (వర్షం-2004), ఫిల్మ్ ఫేర్ అవార్డు బెస్ట్ కొరియోగ్రాఫర్ (2005- నువ్వొస్తానంటే నేనొద్దంటానా).

  ఫోన్ : (65)62425835
  ఇ-మెయిల్ : Email: register@prabhudeva.com.sg
చిరునామా : గ్రీన్ ఎకర్స్, ముంబయి.