సుమ కనకాల


స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితురాలు సుమ కనకాల. కేరళకు చెందినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ ఇంటిల్లిపాదికీ ఫేవరేట్ యాంకర్ గా మారిపోయింది. చక్కటి వ్యాఖ్యానం, చెరగని చిరునవ్వు ఈమె సొంతం. టీవీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణలు, ఇతర సినిమా కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సమయస్పూర్తితో, మాటల గలగలతో, అందరినీ కలుపుకుపోయే స్నేహభావంతో పలువురి మన్ననలను పొందుతోంది.
మరిన్ని వివరాలు




పేరు : సుమ కనకాల
ముద్దుపేర్లు : సుమ
పుట్టిన తేదీ : 1975-03-22
పుట్టిన ఊరు : కేరళ, ఇండియా
మాతృభాష : మళయాళం
చదువు : ఎం.కాం
వృత్తి : యాంకర్, యాక్టర్, ప్రొడ్యూసర్ (లక్కు-కిక్కు, కెవ్వు కేక).
హీరోగా తొలి సినిమా : తొలి పెర్ఫార్మెన్స్ : మేఘమాల (సీరియల్ -1990)
గుర్తింపు తెచ్చిన సినిమా : స్టార్ మహిళ
అవార్డులు-రివార్డులు : పంచావతారంకు నంది అవార్డు, లిమ్కా ఫ్రెష్ ఫేస్ అవార్డు, స్టార్ మహిళకు బెస్ట్ యాంకర్ అవార్డు.