ఉదయ భాను


తెలుగు టీవీ గ్లామర్ యాంకర్ అంటే ఉదయ భాను అనే చెప్పాలి. యాంకర్స్ మోడరన్ డ్రెస్ ట్రెండ్ ఉదయభానుతోనే మొదలైంది. ‘ఢీ’ డాన్స్ షో లో ఉదయభాను యాంకరింగ్ కంటే ఆమె అందచందాలే హైలెట్. చిన్న వయసులోనే ‘హృదయాంజలి’ అనే ప్రోగ్రాం యాంకరింగ్ తో మొదలైన ఈమె ప్రస్థానం, సాహసం చేయరా డింభకాతో పీక్ స్టేజ్ కు వెళ్ళిపోయింది. వెంటవెంటనే యాంకరింగ్ ఛాన్స్ లు అందిపుచ్చుకుంటూ అడపాదడపా సినిమాల్లోనూ ఓ మెరుపు మెరుస్తోంది. ప్రస్థుతం అంత:పురం, పిల్లలూ పిడుగులూ షోలకు యాంకరింగ్ చేస్తోంది.
మరిన్ని వివరాలు




పేరు : ఉదయ భాను
ముద్దుపేర్లు : ఉదయ భాను
పుట్టిన తేదీ : 0000-00-00
పుట్టిన ఊరు : సుల్తానాబాద్, కరీంనగర్
మాతృభాష : తెలుగు
చదువు : ఎం.ఎ తెలుగు లిటరేచర్
వృత్తి : యాంకర్, యాక్టర్
హీరోగా తొలి సినిమా : హృదయాంజలి (టీవీ ప్రోగ్రాం), ఎర్ర సైన్యం (1990-సినిమా)
గుర్తింపు తెచ్చిన సినిమా : వన్స్ మోర్ ప్లీజ్ (వేణుమాధవ్ తో), ఢీ
మొత్తం సినిమాలు : సాహసం చేయరా డింభకా, జాణవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం గాను, ఢీ, రేలా రేలా, పిల్లలు పిడుగులు మరికొన్ని టీవీ షోలతో పాటు కొండవీటి సింహాసనం, శ్రావణమాసం, సినిమాల్లో నటించింది. కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది.