ప్రభాస్


ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. ఇతన్ని కూడా సినీ వారసుడనే అనవచ్చు. ప్రముఖ హీరో ఆరడుగుల అందగాడు కృష్ణం రాజు తమ్ముడి కుమారుడు. తెలుగులో అతి తక్కువగా ఉన్న పొడుగు హీరోల్లో ఇతనూ ఒకడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి వంటి సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు. 2015, జులై 10న విడుదలై సంచలనం రేపిన ‘బాహుబలి’లో హీరోగా నటించడం అతని సినీ కెరీర్లో ఓ మైలురాయి. ఇంతకు ముందు తెలుగులో తప్ప ఏ భాషలో నటించని ప్రభాస్ నటించిన బాహుబలి ఇండియాలో నాలుగు భాషల్లో రిలీజ్ కావడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. 

మరిన్ని వివరాలు
పేరు : ప్రభాస్
ముద్దుపేర్లు : యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి
పుట్టిన తేదీ : 1979-10-23
ఎత్తు : 6‘2
పుట్టిన ఊరు : మొగల్తూరు, పశ్చిమగోదావరి జిల్లా, ఆం.ప్ర, ఇండియా
మాతృభాష : తెలుగు
చదువు : డి.ఎన్.ఆర్ స్కూల్, భీమవరం, శ్రీచైతన్య కాలేజీ
వృత్తి : నటుడు
అభిరుచులు : సినిమాలు చూడ్డం
తీరాల్సిన కోరికలు : నచ్చిన పాట: మెల్లగా కరగనీ....(వర్షం)
నచ్చిన ఫుడ్ : బిర్యాని
నచ్చిన పానీయం : నచ్చిన పువ్వు: టులిప్స్
నచ్చిన ఆటలు : వాలీబాల్
దుస్తులు : క్యాజువల్స్,
నచ్చిన రంగు : నలుపు
నచ్చిన పుస్తకం : ఫౌంటెయిన్ హెడ్
నచ్చిన సంగీతం : హాలీడే స్పాట్: లండన్
నచ్చిన వాహనం : స్నేహితులు: గోపీచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచుమనోజ్
నచ్చిన హీరో : రాబర్ట్ డీ నీరో
హీరోయిన్ : సావిత్రి, జయసుధ, త్రిష, శ్రియ
నచ్చిన సినిమా : భక్త కన్నప్ప, గీతాంజలి
నచ్చిన సంగీత దర్శకుడు : ఎ.ఆర్.రెహ్మాన్
హీరోగా తొలి సినిమా : ఈశ్వర్ (2002)
గుర్తింపు తెచ్చిన సినిమా : వర్షం
మొత్తం సినిమాలు : 18
తండ్రి : సూర్యనారాయణరాజు
తల్లి : శివకుమారి
భార్య/భర్త : పెదనాన్న: కృష్ణంరాజు
అవార్డులు-రివార్డులు :

సంతోషం, సినీ మా అవార్డులు (వర్షం, డార్లింగ్)

 సోదరుడు / సోదరి : ప్రమోద్, ప్రగతి