‘బాహుబలి’ సెంథిల్ కు ఫ్రెంచ్ గౌరవం

October 16, 2015 | 03:31 PM | 6 Views
ప్రింట్ కామెంట్
senthil_French-award_niharonline

రాజమౌళి వదలకుండా కట్టి పడేసుకున్న సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. ఈయనకు ఎప్పటినుంచో తన సొంతంగా ఓ సినిమా చేయాలనే కోరిక ఉందట కానీ రాజమౌళి వదిలి పెట్టడం లేదని ఓ సందర్భంలో అన్నాడు. ఈ టేస్ట్ ఉన్న సినిమాటోగ్రాఫర్ కు ఇప్పుడు ఫ్రెంచ్ ఓ అవార్డునిచ్చి గౌరవించింది. మాంచి టేస్ట్ ఉన్న ఫొటో గ్రాఫర్ కావడంతో ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫిక్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ (AFFECT) సంస్థ ఈ అరుదైన పురస్కారాన్ని అందించింది. ఈయన రాజమౌళి సినిమాలైన ‘ఛత్రపతి’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’కి పని చేశాడు ఇవే కాక ‘అరుంధతి’ సినిమాకు కూడా పని చేశాడు. ఇండియన్ సినిమాకు సెంథిల్ అందించిన సేవలను ప్రశంసిస్తూ రవి. కె. పోట్దర్ అవార్డును ప్రదానం చేసింది. ముంబైలో జరిగిన సంస్థ ఈవెంట్‌లో సెంథిల్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక తనకు ఈ అవార్డు రావడం పట్ల సెంథిల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అఫెక్ట్ సంస్థ తనను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో గోవింద్ నిహాలని, ఆర్.ఎమ్.రావు, రత్నవేలు తదితరులు ఈ అవార్డును పొందిన వారిలో ఉన్నారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ