ఈ టాపిక్ ఎందుకు ఎలా వచ్చిందో తెలియదు కానీ, హీరోయిన్ల పీరియడ్స్ టైమ్ కు సంబంధించిన ఒక టాపిక్ పై బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా చాలా ఓపెన్ గా మాట్లాడేసింది. చాలా వరకు పీరియడ్స్ అప్పుడు ఉండే కడుపునొప్పి, నడుం నొప్పి వల్ల తెలుగు హీరోయిన్లు ఆ టైమ్ చూసుకుని షూటింగ్ కు సెలువు తీసుకుంటారట. కానీ బాలీవుడ్ లో మాత్రం తప్పని సరిగా నటించాల్సి వస్తుందని పరిణీతి బాధపడింది. ఆ సమయంలో డాన్సులే ఉండొచ్చు, ఫొటో షూట్ లే ఉండొచ్చు...మరేమైనా కానీ చేసి తీరాల్సిందేనట. ఈ విషయాలు అందరూ చెప్పుకోలేనివి కదా... బాధ వున్నా సరే... ఆ ఫీలింగ్ కనపడనీయకుండా నవ్వులు చిందిస్తూ నటించాలని అంది పరిణీతి చోప్రా. ఇబ్బంది ఉంది నటించలేనంటే, ఆ హీరోయిన్ కు పొగరంటారట. నిజమే కదా... కొన్ని ప్రొఫెషన్ల లో ఉన్న ఆడవాళ్ళకు ఈ మూడు రోజుల ఇబ్బంది అధిగమించడం కష్టమే మరి.