గాలి వార్తలనేవి వేగంగా పాకిపోతుంటాయండీ... అందుకే వాటిని గాలితో పోల్చారేమో... అక్కడ విషయం ఏమిటో తెలియదు గానీ... నితిన్-జగన్ సినిమా ఆగిపోవడానికి చార్మి కారణమనే వార్తలు పుట్టుకొచ్చాయి... ఒళ్ళు మండితే మనం ఏమంటున్నామో మనకే అర్థం కాదు... ఛార్మి విషంలోనూ అదే జరిగింది. ‘అసలు నాకూ, నితిన్ సినిమాకూ సంబంధం ఏమిటి...? ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయటానికి నితిన్ వద్ద డబ్బులు లేకపోవచ్చు.... సో సినిమా ఆగిపోయింది. ఉన్న డబ్బులన్నీ అఖిల్ సినిమాకు పెట్టేయటం వల్లే ఈ సినిమా మొదలు కాలేదు...దానికి నేనెలా భాధ్యురాలిని’’ అని ఛార్మి కామెంట్ చేసింది. అయితే ఇప్పుడా కామెంట్ ని ఆమె వెనక్కి తీసుకుంటోంది. రూమర్స్ ని తట్టుకోలేక టంగ్ స్లిప్ అయ్యిందనీ.... సిన్సియర్ గా క్షమాపణ అడుగుతున్నట్లు తెలియచేసింది. ‘‘నితిన్-పూరి సినిమా ఎందుకు ఆగిందో నాకు తెలియదు. కానీ కొన్ని రూమర్స్ విని... ఫైనాన్సియల్ కారణాలు వల్లే అనుకోవటం జరిగింది. నేను చెక్ చేసుకుని మాట్లాడక పోవటం నా పొరపాటు. అందుకోసం నేను సిన్సియర్ గా క్షమాపణలు అడుగుతున్నాను’’ అన్నది. నితిన్ తో సినిమా డ్రాప్ అవడంతో పూరి మరో హీరోతో, మరో ప్రొడ్యూసర్ తో సినిమా తీస్తున్నట్టు చెప్పేశాడు.
ఇక పూరితో ఛార్మి రిలేషన్ గురించి కూడా వార్తలు వస్తుండడంతో... ఛార్మి ‘‘ఆయన నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే... ఆయనకు ఫ్యామిలీ ఉంది. చక్కని సంబంధ బాంధవ్యాలున్నాయి.’’ అని చెప్పింది. అయితే నితిన్ పూరీతో సినిమా చేస్తున్నట్టు స్టోరీ బాగున్నట్టు....జూన్ 15 షూటింగ్ మొదలుపెడుతున్నట్టు ట్వీట్ చేసాడు కూడా. ఇప్పుడు మళ్ళీ.... ‘కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను’ అని ట్విట్ చేసాడు.