మిత్రవింద వయసు నేటితో 30 లో పడింది. ఏడేళ్ళుగా టాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రముఖ హీరోలతో చక్రం తిప్పేసింది. కెరీర్ పరంగా టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో మంచి పేరు తెచ్చుకుంది. సౌత్ తో పాటు బాలీవుడ్ ఛాన్సుల్ని కూడా మిస్ చేసుకోలేదు. ‘టెంపర్’ తర్వాత తెలుగులో మరో మూవీ చేయని కాజల్‌కు రకుల్, రాశి ఖన్నా లాంటి యంగ్ హీరోయిన్స్ వచ్చాక క్రేజ్ తగ్గిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. పైగా టాలీవుడ్లో ఏదైనా ఛాన్స్ వస్తే కోటిన్నర ఇస్తేనే చేస్తానని డిమాండ్ చేయడంతో దర్శకనిర్మాతలు కాజల్‌ను అప్రోచ్ కావడంలేదని సమాచారం. ప్రస్తుతం తమిళంలో విశాల్, ధనుష్‌లతో చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు, అక్కడ 70 లక్షల లోపే రెమ్యునరేషన్ ఇస్తున్నా చేస్తోందని బాలీవుడ్ ఛాన్స్ వస్తే రెమ్యునరేషన్ పట్టింపులు లేకుండా ఓకే చేస్తుందనే ప్రచారం లేకపోలేదు. ఐనా, టాలీవుడ్లో చివరిగా చేసిన మూడు సినిమాలకు నిర్మాత బండ్ల గణేష్ కావడంతో అడిగినంత రెమ్యునరేషన్ దక్కిందికానీ, ఆ సినిమాలకు కాజల్ వల్ల ఎలాంటి క్రేజ్ రాలేదనీ, ఇకపై స్టార్ హీరోల చిత్రాలు ఈమెకు దక్కే అవకాశం లేదని ఇన్సైడ్ టాక్.