వీరి పెళ్ళి ముచ్చట ఇక లేనట్టేనా?

May 01, 2015 | 03:09 PM | 111 Views
ప్రింట్ కామెంట్
trisha_varnu_engagement_cancil_niharonline

వరుణ్ మణియన్ తో త్రిష ఎంగేజ్ మెంట్ జరిగి ఎంతో కాలం కాలేదు... అప్పుడే ఇలా పుకార్లు మొదలయ్యాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు... కానీ దీనిపై ఎవరూ ఖండించకపోవడంతో... నిజమనే అనుమానాలు అందరిలోనూ బలపడిపోతున్నాయి. వీరి ఎంగేజ్మెంట్ రద్దయింది, ఇద్దరి మధ్య విబేధాలొచ్చాయని, ఇక వీరు పెళ్లి చేసుకునే అవకాశం లేదని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వరుణ్ మణియన్ ప్రొడక్షన్ లో త్రిష నటించననడమే దీనికి కారణమని అందరూ అనుకుంటున్నరు. గత కొంతకాలంగా త్రిష వరుణ్ మణియన్ కూడా కలవడం లేదట. ప్రస్తుతం త్రిష ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తీసి పక్కన పడేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుణ్ మణియన్ సోదరి వివాహ వేడుకకు కూడా త్రిష హాజరు కాలేదట. ఆమె షూటింగుల్లో బిజీగా ఉందేమో అనుకుంటే అందులో నిజం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తన స్నేహితులతో కలిసి త్రిష చెన్నైలో పార్టీల్లో మునిగి తేలుతోందట. ఆమె మునుపటిలాగే షూటింగ్ లు చేసుకుంటూ కాళీ సమయాల్లో స్నేహితులతో పార్టీలు చేసుకుంటోందట. వరుణ్ మణియన్ ను కలవడమనేదే జరగడం లేదనే చర్చలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ