రెజీనా సాహసం....

August 21, 2015 | 01:27 PM | 1 Views
ప్రింట్ కామెంట్
regina_funding_cycling_race_niharonline

సినిమాల తారల వల్ల ఇటీవల మరుగున పడుతున్న మానవత్వం మంచితనం మళ్ళీ మనుషుల్లో పెరుగుతుందనిపిస్తుంది.ఇలా జనాల్లో అవేర్ నెస్ కల్పించేందుకు తమ సమయాన్ని కాస్తయినా ప్రతీ సినీ తార కల్పిస్తే సమాజాన్ని చాలా మార్చవచ్చుననిపిస్తోంది. ఇటీవల విడుదలైన శ్రీమంతుడు చాలామందికి స్ఫూర్తినిస్తోంది.  ఇప్పుడు సినిమా తార రెజీనా కూడా అదే స్ఫూర్తితో  ఓ మంచి పనికి తన వంతు సహాయం చేసింది. పారా అథ్లెట్స్ కోసం ఏకంగా 150 కిలోమీటర్లు సైక్లింగ్ చేసివారి వైద్యానికి కావల్సిన నిధులు సమకూరేలా చేసింది. పారా అథ్లెట్స్ గురించి అందరికీ అవగాహన కల్పించడం కోసం కొంత మంది సామాజిక కార్యకర్తలుబెంగుళూర్ నుంచి హైదరాబాద్ కు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి మద్దుతుగా కర్నూల్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న 150 కిలోమీటర్ల దూరాన్ని సైక్లింగ్ చేసింది రెజీనా! టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ మూవీ శ్రీమంతుడు లో మహేష్ సైకిల్ తొక్కడం తనకి చాలా స్పూర్తి నిచ్చిందని చెబుతోంది రెజీనా. ఎప్పటినుంచో తనకి సైక్లింగ్ లో ప్రాక్టీస్ ఉందనిఅయితే ఇంత దూరం మాత్రం సైకిల్ రైడ్ చేయడం ఇదే మొదటిసారనిఈ పని చేయడం ఎంతో కష్టమైనప్పటికిర్యాలీ పూర్తి చేయడం తనకి పూర్తి ఆనందాన్నిసంతృప్తినిచ్చిందని చెపుతోంది రెజీనా. అంతేకాదు త్వరలో ఇలాంటి కార్యక్రమాలకి మరింత సమయాన్ని కేటాయిస్తానని తెలిపింది. ఇలా సినిమా తారలందరూ సమాజానికి ఏదో ఒక రకంగా తోడ్పాటునందిస్తే... అభివృద్ధి చెందిన దేశాల సరసన మన ఇండియా కూడా చేరిపోతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ