అఖిల్ ను పెద్ద హీరో అంటున్న సూపర్ స్టార్ !

September 21, 2015 | 11:55 AM | 3 Views
ప్రింట్ కామెంట్
Akhil_Movie_Audio_Launch_Photos_03_niharonline_(37)

అక్కినేని నాగేశ్వర్ రావుకు లిఫ్ట్ ఇచ్చి, ఎండింగ్ లో అక్కినేని కుటుంబాన్నంత కాపాడిన పెద్ద హీరో అనిపించుకున్నాడు అఖిల్. ఆ కొద్ది సమయంలోనే ఓ పెద్ద హీరో అయిపోయాడు. ఈ రోజు అఖిల్ ఆడియో వేడుకలో అక్కినేని నాగేశ్వర్ రావును పదే పదే గుర్తుచేసుకున్నారంతా. అయితే నాగార్జున అభిమానులనుద్దేశించి... ‘‘ఆయన ఎప్పుడూ నాతోనే, మనతోనే ఉంటారు. అభిమానుల కేరింతల్లోనూ, సంతోషంలోనూ నాన్నగారిని చూసుకొంటుంటా'' అన్నారు.  అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా తనయుడు అఖిల్ తొలి చిత్రం ఆడియో వేడుకను జరిపారు. ఆడియోతో పాటు ఈ చిత్రం ధియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ లో ఈ సినిమాలో ఏదో కొత్త దనం ఉన్నట్టు తెలుస్తోంది. అఖిల్ ఫైట్లు, డాన్స్ బాగానే చేశాడు. ట్రైలర్ ముఖ్య అతిథిగా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించారు.
ఎంతో మంది హాజరైనప్పటికీ, హాజరు కాని మహానటులు అఖిల్ కు విషెస్ వీడియో బైట్ ద్వారా అందించారు. ఇందులో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, వెంకటేశ్, ప్రభాస్, రానా, అలాగే క్రికెటర్ సచిన్ టెండూల్కర్, తమిళ హీరో సూర్య, శ్రుతిహాసన్ తదితరులున్నారు.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ...   ''అక్కినేని ఫ్యాన్స్‌ కి, మహేశ్‌బాబు కు  థ్యాంక్స్. మా బ్యానర్‌ను, వినయ్‌గారిని నమ్మినందుకు చాలా థ్యాంక్స్.'' అన్నారు.అఖిల్ మాట్టాడుతూ ‘‘నెక్స్ట్ సినిమా మీతోనే చేస్తా.. వీవీ వినాయక్‌గారు నన్ను కొడుకుగా, ఓ ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. 'నెక్ట్స్ సినిమా కూడా నేను మీతో (వినాయక్) నే చేస్తాను. మీరు మాట కూడా ఇచ్చారు’’ అని అఖిల్ అన్నారు. ‘‘వీడియో బైట్ కోసం అందరికీ ఫోన్ చేసినట్టే మహేష్ బాబు కూడా చేశాను కానీ ఆయనే స్వయంగా వస్తానన్నారు. నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మహేశ్‌బాబుగారికి స్పెషల్ థ్యాంక్స్. వినాయక్‌గారు ఇదివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అనూప్‌, తమన్‌లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నయ్య, నేను బయట పెద్దగా మాట్లాడుకోం. కానీ నా గురించి వేదికలపై చాలా బాగా చెబుతుంటాడు. ఆ మాటల్ని చాలా ఇష్టపడుతుంటా'' అన్నారు.
ఆవిష్కరణ తొలి సీడీని నాగార్జున, అమల, నాగచైతన్య ఆవిష్కరించారు.
మహేష్ మాట్లాడుతూ..... '''మనం' సినిమా చూశాక, నాగార్జునగారికి ఫోన్ చేసి అఖిల్ తెరపై వెలిగిపోయాడని చెప్పాను. అతనికి టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. మన తెలుగు సినిమాకు మరో పెద్ద హీరో వచ్చాడు'' అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ... ''నాన్నగారి పుట్టిన రోజు సందర్భంగా 'అఖిల్' ఆడియో లాంచ్‌కు వచ్చిన అందరికీ నా థ్యాంక్స్. అఖిల్ అంత బాగా కనడుతున్నాడంటే దాని వెనుక చాలా మంది కృషి ఉంది. మహేష్ కు ధాంక్స్ కృష్ణగారి వారసుడు నా వారసుడి ఆడియో లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. యువతరాన్ని ప్రోత్సహించడానికి వచ్చిన మహేశ్‌బాబుకు మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నాను’’ అన్నారు.
వీవీ వినాయక్ మాట్లాడుతూ... ' 'ఈ సినిమా హిట్ అవుతుందని ముందు నాగార్జునగారికి ప్రామిస్ చేశాను. అఖిల్ కచ్చితంగా సూపర్‌స్టార్ అవుతాడు. బ్యాక్‌బోన్‌గా నిలిచిన సుధాకర్‌రెడ్డిగారికి థ్యాంక్స్. ఈ సినిమా అంత బాగా వచ్చిందంటే అదంతా ఆయన కష్టమే'' అన్నారు.
ఈ వేడుకలో... సుమంత్, సుశాంత్, నాగసుశీల, నిమ్మగడ్డ ప్రసాద్, కొరటాల శివ, నాగచైతన్య, రచయిత కోనా వెంకట్, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, గేయ రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ