మన తెలుగు నటుల్లో ఎవరికీ రాని ఆలోచనలో మన అక్కినేని నాగార్జునకు రావడం నిజంగా ఆనందించ దగ్గ అంశం. సినీ పరిశ్రమలో ఎందరో వారసులున్నా... కలిసి నటించి ప్రేక్షకులను తృప్తి పరిచే సాహసం ఎవరూ చేయలేదు. మహానటుడు ఎన్టీఆర్ ఫామిలీలో ఎందరో నటులయ్యారు కానీ, కుటుంబంతో కలిసి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేయలేదు. కానీ నాగార్జున అఖిల్ సంవత్సరం అబ్బాయిగా ఉన్నప్పుడే తనకోసమే ఓ కథ రాయించి సిసింద్రీ తీసి సక్సెస్ చేశాడంటే... ఇక్కడ కథలను బట్టి నటులు కాదు వారికోసం కథలు రాయించడమనే ట్రెండ్ ఫాలో అయ్యాడు. ఇప్పుడు వస్తున్న అఖిల్ సినిమా కూడా అంతే... తన రెండో కొడుకును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనీ, అది కూడా ఓ కమర్షియల్ హీరో కావాలని ఆయన చేసిన ప్రయత్నం మెచ్చుకోదగింది. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతిలో అఖిల్ కెరీర్ పెట్టేశాడు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియోకు శ్రోతల నుంచి ట్రెమండస్ వస్తోంది. ఇప్పుడు 'అఖిల్' ఆడియోను యు.ఎస్ లో మూడు చోట్ల విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 25న బే ఏరియాలో, సెప్టెంబర్ 26న డల్లాస్‌లో, సెప్టెంబర్ 27న న్యూ జెర్సీలో 'అఖిల్' ఆడియో ఫంక్షన్లను నిర్వహిస్తున్నారు. ఈ ఫంక్షన్లకు అఖిల్ అక్కినేనితోపాటు చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అక్టోబర్ 22న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాత నితిన్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతంరాజు, భాస్కరభట్ల, కృష్ణచైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: నితిన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.