వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ డెబ్యూ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ఈ చిత్రం బృందం ఓ ప్రకటన చేసినప్పటికీ ఇటీవల వినవస్తున్న వార్తల్లో ఈ సినిమా డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేయనున్నట్టు తెలుస్తోంది. కారణం నాగార్జున హిట్ అయిన సినిమాలన్నీ డిసెంబర్ లో విడుదల కావడమే... అదే కాకుండా అక్టోబర్ దసరా సందర్భంగా విడుదల చేయాలనుకునే సినిమాలు ఎక్కువగా ఉండడంతో అఖిల్ కూడా తన సినిమాను అదే సమయంలో విడుదల చేయడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటికే రాంచరణ్ అక్టోబర్ 12 లేదా 15 తన సినిమాలు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇవే కాక మరికొన్ని సినిమాలు ఆ సమయంలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతుండడంతో ఈ సినిమాకు అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణాలన్నిటి వల్ల అఖిల్ సినిమాను అక్టోబర్ లో కాకుండా డిసెంబర్ లో విడుదల చేయాలని నిర్మాత నితిన్ కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా అఖిల్, సాయేషా న్యూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.