తాతల తండ్రుల స్టయిల్ లోనే నటవారసులు

March 19, 2015 | 12:40 PM | 215 Views
ప్రింట్ కామెంట్
Akhil_Mokshagna_niharonline

కొంత మంది సినీ నటులను చూస్తే వీళ్ళు ఈ పాత్రలకయితేనే బాగుంటారనిపిస్తుంది. కాకపోతే నటులన్న తరువాత అన్ని రకాలుగా మెప్పించాలి కాబట్టి అన్ని రకాల పాత్రలు చేసేస్తుంటారు. కొంత మంది డైరెక్టర్ల ప్రతిభను బట్టి కూడా ఒక నటుడ్ని ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసేలా మౌల్డ్ చేస్తుంటారు. ఈ విషయంలో డైరెక్టర్ రాజమౌళిని మెచ్చుకోవాలి. పాత సినిమా డైరెక్టర్లలో డాక్టర్ విశ్వనాథ్ ఈ తరహాలో నటులను చక్కగా ఉపయోగించుకున్నారు.

      మొన్నీ మధ్య ఓ పెద్ద దర్శకుడన్నట్టు కథలు నటులను బట్టే తయారవుతున్నాయి. అంటే ఫలానా హీరోను ప్రేక్షకులు ఇలా అయితేనే చూస్తారనే భావంతో వాళ్ళను ఆ విధంగానే చూపిస్తున్నారు డైరెక్టర్లు.  బాల కృష్ణ చేసే ఓ పవర్ ఫుల్ రోల్ రాజేంద్రప్రసాద్ కు ఇస్తే ఎలా ఉంటుంది? మన ఎం.ఎస్.నారాయణ చేసిన పేరడిలా నవ్వుకుంటారందరూ... ఇప్పుడు కొత్తగా చాలా మంది వారసులు  తెరంగేట్రం చేస్తున్నారు. వారి తండ్రుల మాదిరిగానే వారి ఫేస్ రీడింగ్సూ అలాగే కనిపిస్తున్నాయి. అఖిల్ ను చూస్తే ఓ లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. కానీ అతని మొదటి సినిమా ఓ యాక్షన్ చిత్రంలా తీస్తున్నట్టు అనిపిస్తోంది. అక్కినేని నాగార్జున విషయానికి వస్తే కూడా కొన్ని యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ... అవి సక్సెస్ కూడా అయినప్పటికీ... ఆయన చేసిన సంతోషం, మన్మథుడు, నిన్నే పెళ్ళాడతా, చంద్రలేఖ వంటి సినిమాలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు. ఆయనకు అవే బాగా సూటవుతాయనిపిస్తుంది. అన్నమయ్య లాంటి డిఫరెంట్ క్యారెక్టర్లు కూడా ఎన్నో చేశారు.  అవన్నీ కూడా సాఫ్ట్ కార్నర్ ఉన్న పాత్రలే కాబట్టి ఆయనకు బాగా సూటయ్యాయి. కానీ శివ లాంటి కొన్ని సినిమాలు మాస్ యాక్షన్ సినిమాలు... ఈ సినిమాల్లో కేవలం దర్శకుడి ప్రతిభే కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు కూడా చేసి మెప్పించినప్పటికీ ఆ ఫేస్ లో రఫ్ నెస్ చాలా తక్కువగా కనిపిస్తుంది.

       ఇప్పుడు అఖిల్ కూడా అంతే అనిపిస్తుంది. మొదటి సినిమా హై రేంజ్ లో ఉండాలనే ఉద్దేశంతో యాక్షన్ మూవీని... అది కూడా ఓ కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న డైరెక్టర్ తో చేస్తున్నారు. ఇందులో అఖిల్ ను విలన్లను రఫ్ ఆడించే హీరోగా చూపించినా అతని నాజూకు తనం మాత్రం తప్పనిసరిగా బయట పడుతూనే ఉంటుంది.

       ఇక రాబోయే మరో యువ కిషోరాన్ని చూద్దాం... బాలకృష్ణ తనయుడు మోక్షఙ్ఞ. ఇతని ఫేస్ నందమూరి వారి స్టయిల్ లోనే కత్తులు, బాంబులు, తుపాకులు పడితే బాగానే సూటవుతాడనిపిస్తుంది. ’బొబ్బిలి సింహం’.... ’సింహ’... ‘నరసింహ నాయుడు’... ఇలా పేర్లు వింటేనే ఓ పవర్ ఫుల్ రోల్స్ మన ముందు ప్రత్యక్ష మైపోతాయి. అలాంటి క్యారెక్టర్లకు మోక్షఙ్ఞ ఫేస్ బ్రహ్మాండంగా సూట్ అవుతుందని పిస్తుంది. కానీ విచిత్రమేమిటంటే... అఖిల్ కు మాస్ మసాలా అందించే డైరెక్టర్ వి.వి.వినాయక్ డెబ్యూ మూవీ చేస్తుంటే మోక్షఙ్ఞ మాత్రం బాలయ్య వందో సినిమా అయిపోయే నాటికి కుటుంబ కథా చిత్రాలను అందంగా చూపించే శ్రీకాంత్ అడ్డాలతో డెబ్యూ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్యకు మంచి స్నేహ సంబంధాలున్న వారాహి ఫిల్మ్స్ అధినేత సాయికొర్రపాటి ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ