అఖిల్ సినిమాకు ఇంత బిజినెస్సా?

July 24, 2015 | 03:33 PM | 8 Views
ప్రింట్ కామెంట్
Akhil_Akkineni_Stills_niharonline

ఈ సిసింద్రీకి ఎంత ఫాలోయింగ్ ఉందో ‘మనం’ చివరి సీన్ లో అఖిల్ ఒక్క లుక్ ఇచ్చినప్పుడే అర్థమై పోయింది. నాగార్జున కూడా తెలివిగా మాస్ డైరెక్టర్ వినాయక్ కు అఖిల్ అరంగేట్ర బాధ్యత అప్పగించి మంచి నిర్ణయం తీసుకున్నాడు. నాగ్ తీసుకున్న నిర్ణయం ఎంత కరెక్టో ఇప్పుడు అఖిల్ తొలి సినిమాకు జరుగుతున్న బిజినెస్ ను బట్టి తెలుస్తోంది. ఇప్పటిదాకా టాలీవుడ్ చరిత్రలో ఏ అరంగేట్ర హీరో సినిమాకూ జరగనంత బిజినెస్ అఖిల్ సినిమాకు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ సినిమాలకు ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతోందో.. అఖిల్ తొలి సినిమాకు కూడా అదే స్థాయిలో బిజినెస్ అవుతుండటం విశేషం.
అక్టోబరులో సినిమా విడుదల అంటే మూడు నెలల ముందే చాలా ఏరియాల్లో బిజినెస్ అయిపోవడం విశేషం. నైజాం కర్ణాటక కలిపి ఎన్ఆర్ఏ సంస్థ రూ.18 కోట్లకు రైట్స్ తీసుకుందట. సీడెడ్ కు లక్ష్మీకాంత్ రెడ్డి రూ.6.1 కోట్లకు రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. వైజాగ్ కు రూ.4.5 కోట్లు పశ్చిమ గోదావరికి రూ.2.25 కోట్లు నెల్లూరుకు రూ.1.6 కోట్లు.. బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మిగతా ఏరియాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఓవర్సీర్ రైట్స్ రూ.4 కోట్లు పలకొచ్చని అంచనా. అన్ని ఏరియాలూ కలుపుకుంటే రూ.43-45 కోట్ల మధ్య అఖిల్ ఫస్ట్ మూవీ బిజినెస్ చేస్తుందని అంచనా. ఇందులో వినాయక్ క్రెడిట్ కూడా ఉన్నప్పటికీ తొలి సినిమాతోనే ఈ స్థాయిని అందుకోవడం మామూలు విషయం కాదు. సినిమా హిట్టయితే అక్కినేని కుర్రాడి రేంజే వేరుగా ఉంటుందేమో మరి.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ