అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ సినిమా త్వరలో షూటింగ్ జరుపుకోడానికి సిద్ధమవుతోంది. నట వారసుల కుటుంబంలోని మరో నటుడి తెరంగేట్రం కావడంతో ఈ సినిమా బాధ్యతను చాలా ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్నారు వి.వి.వినాయక్. ఈ సినిమాను దాదాపు అమెరికా, దక్షిణాఫ్రికాల్లో చీత్రీకరించడానికి వినాయక్ ఏర్పట్లు చేసుకుంటున్నాడు. కొంత భాగాన్ని ఓల్డ్ సిటీలో షూటింగ్ జరుపుతున్నట్టు తెలిసింది. ఇంతకుముందు సినిమాలు చాలా వరకూ హైదరాబాద్ లోనే షూటింగ్ జరిపిన దర్శకుడు ఈసారి విదేశాల్లో తీయాలనుకోవడంలోని ఆంతర్యమేమై ఉంటుందని అభిమానుల అంచనాలకు అందడంలేదు. ఈ స్టోరీని అనుసరించి విదేశాల్లో తీస్తున్నారా? లేక విదేశీ అందాలను సినిమాలో బంధించాలనుకుంటున్నారో తెలియక తికమకపడే ప్రేక్షకుల ముందు కు ఈ సినిమా ఎప్పుడు రానున్నదో వేచి చూడాల్సిందే.