ఒక్కొక్కళ్ళ మాట తీరు, మనస్తత్వం ఒక్కో రకంగా ఉంటుంది. కేవలం ఏదో రకంగా నవ్వించడానికే... మనసులో ఏ చెడు ఉద్దేశాలు ఉండవు అన్న తీరు అలీది. ఓ క్షణం హాయిగా నవ్వుకుని మరు క్షణం మరిచిపోయే కాన్సెప్ట్ ఆయనది. దీన్ని బూతద్దంలోంచి చూసి, ఆయన మాటల్లోని అర్థాన్ని విశ్లేషించి... మీనింగులు వెతుక్కుని ఛీ...ఛీ అని సీరియస్ అయితే కష్టం... కేవలం నాలుక చివరినించి వచ్చే మాటలే గానీ... చేతల్లో ఆయన ఆడవారిని గౌరవిస్తారనే విషయం అందరికీ తెలిసిందే... ఆయన మాటల్లో డబల్ మీనింగ్ లు మనసులోనూ ఉంటే అన్న పూర్ణ మాటలను అంత తేలిగ్గే తీసుకునే వాడు కాదు. ‘పోనీలే చిన్న పిల్ల’ అని మరో మాట మాట్లాడకుండా తేలిగ్గా తీసి పారేసినట్టు కనిపిస్తోంది ఆయన తీరు. అందుకే అలీ షోలో ఎప్పటిలా డబుల్ మీనింగ్ తో మాట్లాడే అలీతో యాంకర్ శ్యామల ‘మాటలు వేరే రకంగా కనెక్ట్ అవుతున్నాయి. అన్నపూర్ణకు చెప్తా’ అని వేలు చూపించి బెదిరించినట్టు మాట్లాడితే (నవ్వుతూ)... ‘చెప్తావా?’ అని అమాయకంగా ఫేస్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు అలీ. యాజ్ యూజువల్ గా. ఎప్పుడూ పంచ్ ల మీద పంచులు వేసే అలీ మాటల్లో బోలెడు ద్వంద్వార్థాలు ధ్వనిస్తుంటాయి. ఈ మాటతీరును తప్పుబట్టారు చాలా మంది. అలాగే అన్న పూర్ణ కూడా. ‘డాక్టరేట్ ఉంది కానీ.. కామన్ సెన్స్ లేదు’ అనేసింది ఆ అమ్మడు. ఈ మాటలను నిజమే అనుకున్న వారూ ఉన్నారు. కాసేపు నవ్వుకోడానికి అన్న వారూ ఉన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా నా పద్ధతి నాది అని కుండలు బద్దలు కొట్టి చెప్పకపోయినా... సున్నితంగా తన పద్ధతి ఇదే అంటూ కంటిన్యూ అయిపోతున్నారు అలీ.