కేవలం సినిమాలో మునిగి తేలేకంటే అప్పుడప్పుడు ఆటవిడుపుగా హాకీలూ, క్రికెట్లు ఆడుకోవచ్చు కదా సినిమా వాళ్ళంతా. అందుకే ఈ మధ్య సిసిఎల్ నిర్వహించి, నటన ఒక్కటే కాదు వీరిలో ఈ టాలెంటూ ఉంది అని నిరూపించుకుంటున్నారు కొందరు సినీ తారలు.... ఇప్పుడు అలియాభట్ రోజూ పొద్దున్నే లేచి హాకీ ప్రాక్టీస్ చేస్తుందట. ఇంతకూ ఆవిడ ఏ పోటీల్లో పాల్గొంటోంది అని డౌట్ వస్తోంది కదా... పోటీలు కాదట. తాను నటించే ‘ఉడ్తా పంజాబ్’ అనే సినిమా కోసం ఈ ప్రాక్టీసట. ఇందులో తాను హాకీ ప్లేయర్ గా నటిస్తోంది. ఈమెకు జతగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలోని మరో విశేషం ఒకప్పటి ప్రేమ జంట షాహిద్-కరీనా కపూర్ లు నటిస్తున్నారు. కరీనా కపూర్ ది ఇందులో మెయిన్ రోల్ చేస్తోందట. పీకూలో సినిమాతో దీపిక బెంగాలీ భాష నేర్చుకుంటే, ఈ సినిమాలో కరీనా పంజాబీ భాషలో అదరగొడుతుందట.