స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఆఖరి దశకు చేరుకుంది. దీంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని గత కొద్ది రోజులుగా ఫ్యాన్స్ తోపాటు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చనడుస్తుంది. శేఖర్ కమ్ముల అని, విజయ్ కుమార్ కొండేటి అని రకరకాల పేర్లు వినిపించాయి. ఆ వార్తలు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు బోయపాటి శ్రీను దగ్గర ఆగాయి. అయితే బన్నీ నెక్స్ ప్రాజెక్ట్ బోయపాటితోనేనని, అది కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే నని అల్లు అరవింద్ ప్రకటించేశాడు. లవ్ అండ్ యాక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనున్నట్లు ఆయన చెప్పాడు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తాడని, సంభాషణలు ఎం.రత్నం అందిస్తాడని ఆయన మీడియా సమావేశంలో వివరించాడు. మిగతా తారాగణం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.