అమితాబ్ చూస్తుండగా... ఫిల్మ్ సిటీలో కాల్పులు

May 22, 2015 | 05:32 PM | 59 Views
ప్రింట్ కామెంట్
Amitabh_Bachchan_tweets_niharonline

ఇది మాత్రం షూటింగ్ కాదండీ... షూటింగ్ ఫక్కీలో జరిగిన నిజం... ముంబై ఫిల్మ్ సిటీలో కాల్పులు జరిగాయంటూ అమితాబ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.  సెక్యూరిటీ ఏజెన్సీ యజమానిపై దుండగులు కాల్పులు జరిపారట. ఈ సంఘటన అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ కు 20 అడుగుల దూరంలోనే జరిగిందట. అమితాబ్ వెంటనే స్పందించి తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేశారు. ‘ముంబై ఫిల్మ్ సిటీలో కాల్పులు జరిగాయి. చూస్తే గ్యాంగ్ వార్ షూటౌట్ లా ఉంది. మా షూటింగుకు 20 అడుగుల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఒకరు చనిపోయారు. ఎక్కడ చూసినా... పోలీసులే’ అంటూ ఆశ్చర్యానికి గురవుతూ అందరికీ షేర్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ