‘పీకూ’ సినిమా తిలకించిన ప్రణబ్ ముఖర్జీ

June 08, 2015 | 04:29 PM | 1 Views
ప్రింట్ కామెంట్
piku_poster_pranab_mukherji_niharonline

షూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందిన పీకూ సినిమాకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ కథ ఉండడంతో... అందులో టాప్ హీరోయిన్ బాలీవుడ్ బిగ్ బీ ఇందులో నటించడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ 'పికూ' సినిమాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చూశారు. ఆయన కోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆయనకు ఈ సినిమాతో పాటు సినిమాలో బెంగాలీ యాసలో ఉన్న హిందీ కూడా బాగా నచ్చిందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే చక్కటి అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో కూతురి పాత్ర పోషించిన దీపికా పడుకొనే.. తన సొంత జీవితాన్ని సైతం పక్కన పెట్టి, తండ్రి (అమితాబ్) చెప్పే కథలు వింటూ ఉంటుంది. ఇర్ఫాన్ ఖాన్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా మే 8వ తేదీన విడుదలైంది. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీ కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించినట్టు అమితాబ్ సోషల్ నెట్ వర్క్ లో తెలియజేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ