ముదురు జంట మళ్ళీ ప్రేమలో పడితే?

July 13, 2015 | 04:13 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sridevei_amiitab_niharonline.jpg

శ్రీదేవి అమితాబ్ బచ్చన్ కాంబినేషనల్ వచ్చిన మొట్టమొదటి సినిమా ఇంక్విలాబ్. ఇది 1984లో వచ్చిన సినిమా ఆ తరువాత ఆక్రీ రాస్తా, ఖుదాగవా సినిమాల్లో జంటగా నటించారు.  సౌత్ నుంచి నెమ్మదిగా బాలీవుడ్ లోకి జంపైన అందాల భామ శ్రీదేవికి బాలీవుడ్ లో బ్రహ్మరథం పట్టారు అటు వెళ్ళిన తరువాత సౌత్ లో రెండు మూడు సినిమాలకు మించి నటించలేదు. అయితే ఖుదాగవాతో ఈ జంట మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ మధ్య ఖుదా గవా సీక్వెట్ తీయాలని కూడా అనుకున్నారు.  అయితే సెకెండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన శ్రీదేవితో మళ్ళీ ఓ సినిమా అమితాబ్ కాంబినేషనల్ లో తీయాలని అనుకుంటున్నారట. శ్రీదేవి  ప్రస్తుతం తమిళ సినిమా ‘పులి’లో నటిస్తోంది.  అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తోందట. ఈ సినిమాలో శ్రీదేవికి జోడీగా అమితాబ్ నటిస్తున్నాడట. అప్పట్లో ఈ జంట వెండితెరపై కనువిందు చేసిన విషయం తెలిసిందే, మళ్ళీ చాలా కాలం తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. మధ్య వయసులో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రేమ కథతో ఈ సినిమా ఉంటుందట. అర్ బాల్కి దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందనుంది.  మరి ఈ ముదురు జంటను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ