భద్రాచలం పరిసరాల్లో గతంలో ఎన్నో సినిమాల షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో మాత్రం చిన్న సినిమాల నిర్మాతలు ఎక్కువగా తమ ప్రాంతాల్లోని సుందర ప్రదేశాల్లోనే షూటింగ్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఇటీవల పూరి తనయుడు ఆకాష్ నటించిన ఆంద్రాపోరి షూటింగ్ ను ఖమ్మం జిల్లా పాల్వంచలో చేశారు. ఆ చిత్ర దర్శకుడు రాజ్ మాదిరాజు పుట్టి పెరిగిన ప్రదేశం కావడంతో అక్కడ తెరకెక్కించడానికి మొగ్గు చూపారు. తాజాగా ఇక సె.. లవ్ సినిమా షూటింగ్ కూడా ఖమ్మంలోనే జరుగుతోంది. స్థానిక లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మొదలైన షూటింగ్ అప్పుడే 50 శాతం పూర్తయింది. లొకేషన్ల పర్మిషన్లు సులభంగా దొరకడం కూడా అక్కడ షూటింగ్ చేయడానికి కారణమని సినీ వర్గాలు అంటున్నాయి. సాయి రవి, దీప్తి జంటగా ఇక సె..లవ్ సినిమా రూపొందుతోంది. డుంగ్రోత్ నాగరాజ్ దర్శకుడు. గన్నవరపు చంద్రశేఖర్, పీర్యా నాయక్ నిర్మాతలు.