ఇతగాడు ఎవరి గాలానికి చిక్కుతాడో?

January 28, 2015 | 12:51 PM | 34 Views
ప్రింట్ కామెంట్

డైరెక్టర్ కావాలనీ, హీరోలు కావాలని ఇంకా ఇంకా.... సినీ ఫీల్డ్ లో అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మందే ఉంటారు. కొందరు హీరోలు యాక్షన్ బాగా చేసినా సరైన సినిమాలు రాకపోవడం, అదృష్టం కలిసి రాకపోవడం అనేవి జరగవచ్చు. కానీ డైరెక్టర్ కు అలా కాదు...అతనికి స్వేచ్ఛ ఉంటుంది. ఒక ఐడియాలజీ ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇస్తే ఉపయోగించుకోలేదంటే... కొంత లోపం అతనిలో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ‘పటాస్’ దర్శకుడు అనీల్ రావిపూడి తన టాలెంట్ నిరూపించుకున్నాడని స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ సక్సెస్ తో ప్రస్థుతం ఆయనతో సినిమా చేయడానికి హీరోలు క్యూ కడుతున్నారంటే ఇందులో ఆశ్చర్యం ఏముంటుంది? వాళ్ళే డబ్బుపెట్టుకుని సినిమా తీసుకోగల హీరోలు చాలా మందే ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. అందుకే మంచి కథల కోసమూ, ఆ తరువాత డైరెక్టర్ల కోసం వెతుకులాట ఎక్కువైపోయింది. సక్సెస్ సినిమా డైరెక్టర్ల వెంట పడడం మామూలే కదా... 'మిర్చి'తో హిట్‌ కొట్టేసరికి కొరటాల శివ వైపు పరుగులు పెట్టారు. 'రచ్చ'తో సంపత్‌ వైపు, 'గబ్బర్‌సింగ్‌' తో హరీస్‌ శంకర్‌, వైపు 'కందిరీగ' తర్వాత సంతోష్‌ శ్రీనివాస్‌ వైపు పరుగులు పెట్టారంతా. యంగ్‌ హీరోల నుంచి వచ్చే పిలుపులతో ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి తప్పదు సక్సెస్ అయిన కొత్త డైరెక్టర్లకు. కొత్త డైరెక్టర్లంతా ఓ కసితో ఉంటారు కాబట్టి మొదటి సినిమా బాగానే చేస్తారు. కానీ ఎలాంటి ఐడియాలజీ లేకుండా తీసెయ్యమని స్టోరీ ముందు పెడితే, వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు అది కుదరకపోవచ్చు. ప్లానింగ్‌ లేకుండా కాంబినేషన్‌ క్రేజ్‌తో సినిమాలు చేసెయ్యాలన్న ఆదుర్దా ఎవరి నుంచి వచ్చినా ఆ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ కాదనడానికి లోగడ డైరెక్టర్లే ఉదాహరణ. ఇది కొత్త డైరెక్టర్లు గుర్తుంచుకోవాల్సిన అంశం. సినిమా హిట్ అయితే గౌరవాలు, ఫట్ అయితే అవమానాలు పవన్ కళ్యాన్ అంతటి వారికే తప్పలేదు. ఇప్పుడిప్పుడే ఫీల్డులోకి వచ్చిన వారెంత? కాబట్టి ఎవరి వత్తిడికీ లొంగకుండా మనం ఏదైతే చేయగలమన నమ్మకం ఉంటుందో వాటిమీదే కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ కదా... అనీల్ రావి పూడి... ఆల్ ద బెస్ట్....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ