బూతు కామెంట్లు ఇప్పుడైనా మానండి అలీజీ!

July 29, 2015 | 05:40 PM | 2 Views
ప్రింట్ కామెంట్
annapurna_fire_ali_niharonline

తెలుగు సినిమా పోకడపై ఎన్నారై యువతి అన్నపూర్ణ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అన్నపూర్ణ పోస్ట్ చేసిన వీడియోలో డైరెక్టర్లతో పాటు పెద్ద హీరోలు, కమెడియన్స్ ను కూడా ఏకిపారేసింది. వయసు కూడా చూడకుండాలో హాస్యం పేరుతో వెకిలి వేషాలు వేస్తున్నారంటూ బ్రహ్మానందం, అలీ వంటి వారిపై మండిపడింది. తోటి యాంకర్లు, నటీమణులపై గీతదాటి వల్గర్ కామెంట్లు చేస్తున్నారంటూ ప్రముఖ తెలుగు కమెడియన్ అలీని ఘోరంగా తిట్టేసింది. ఇన్నేళ్ళుగా తోటి నటీమణులతో కలిసి పనిచేసిన అలీకి వారిపట్ల ఏమాత్రం గౌరవం ఉందో ఈ కామెంట్లు తెలుపుతున్నాయని అన్నపూర్ణ ఏకిపారేసింది. ఇక అసలు ఆలీ అన్న మాటలేమిటో అందరూ ఈపాటికి టీవీల్లో చూసే ఉంటారు కానీ మరొక్కసారి... హీరోయిన్ సమంతా నడుము ప్రాంతాన్ని బెంజ్ సర్కిల్ తో పోల్చాడు ఒక ఫంక్షన్ లో. కొత్తలో లేతముంజు లా ఉన్న ఈ హీరోయిన్ ముదురు తాటికాయలా మారిపోయిందంటూ గౌరీ ముంజల్ పై మరో ఫంక్షన్లో కామెంట్ చేశాడు.   ప్రముఖ యాంకర్ సుమను సైతం అలీ వదల్లేదు. ఎక్కడ నొక్కాలో, ఎలా నొక్కాలో సుమకు బాగా తెలుసంటూ అలీ కామెంట్ చేశాడు.  ఇది అలీ స్టైల్ అయితే నాటు కామెంట్. ఇక ఆయన టీవీ షోలో అయితే అడుగడుగునా ఇలాంటివి దొర్లుతూనే ఉంటాయి. ఆ మధ్య సంజన డ్రెస్ ను డైరెక్టుగా కామెంట్ చేశాడు. కాకపోతే ఆ అమ్మాయి డ్రెస్ దాచుకోలేని పరిస్థతి ఉందనుకోండి.  చైల్డ్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, హీరోగా, ఎన్నో పాత్రలు చేసిన అలీ, తన సహ నటులపై గౌరవం లేకుండా చేసే కామెంట్లు అలీకి బాగానే వాతలు పెట్టినట్టున్నాయి. ఇప్పుడైనా అలీ వెకిలి కామెంట్లు స్వస్థి పలుకుతారా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ